News February 20, 2025

పెద్దగట్టుకు ఘాట్ రోడ్డు, గెస్ట్ హౌస్: కోమటిరెడ్డి

image

రూ.60 కోట్లతో పెద్దగట్టుకు ఘాట్ రోడ్డు, గెస్ట్ హౌస్ నిర్మిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. జాతరలో పాల్గొని స్వామి వారి దర్శనం అనంతరం మాట్లాడారు. సాధారణ సమయంలోనూ వేలాదిగా భక్తులు తరలివచ్చే మహిమాన్విత జాతర పెద్దగట్టు అన్నారు. వచ్చే జాతరలోపు భక్తులు ఇబ్బందులు పడకుండా బాత్‌రూమ్‌లు, ఇతర సౌకర్యాలు కల్పిస్తామన్నారు.

Similar News

News November 20, 2025

చేనేత కార్మికుల రుణమాఫీకి రూ.33 కోట్లు విడుదల

image

TG: రాష్ట్రంలో చేనేత కార్మికులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రుణమాఫీ కోసం రూ.33 కోట్లు నిధులు రిలీజ్ చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. చేనేత కార్మికుల అప్పులు తీర్చేందుకు వీటిని వినియోగించనున్నారు. నిధుల విడుదలపై చేనేత కార్మికులు ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు.

News November 20, 2025

విజయవాడ: రెచ్చిపోతున్న రేషన్ మాఫియా డాన్.!

image

ఉమ్మడి కృష్ణా జిల్లాలో పేదల బియ్యాన్ని దేశ సరిహద్దులు దాటించే రేషన్ మాఫియా డాన్ ఆగడాలు శృతిమించుతున్నాయి. నియోజకవర్గానికి ఒకరు చొప్పున నియమించుకొని బియ్యాన్ని సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రజాప్రతినిధులకు సైతం నెలకు రూ.7 నుంచి రూ. 10 లక్షల వరకు ఈ మాఫియా డాన్ అవినీతి సొమ్మును ముట్ట చెబుతున్నట్లు సమాచారం. ప్రజాప్రతినిధుల అండ ఉండడంతో అధికారులు కన్నెత్తైనా చూడలేకపోతున్నారు.

News November 20, 2025

మెదక్: ‘కల్లుగీత కార్మికులకు హామీలు నెరవేర్చాలి’

image

కల్లుగీత కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని కేజీకేఎస్ రాష్ట్ర కార్యదర్శి రమేష్ గౌడ్ డిమాండ్ చేశారు. మెదక్‌లో గురువారం కల్లుగీత కార్మిక సంఘం జిల్లా ఆరవ మహాసభలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథి హాజరయ్యారు. గౌడ కులస్తులకు బడ్జెట్లో రూ.5000 కోట్లు కేటాయించాలని, బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు.