News February 3, 2025
పెద్దగట్టులో భారీ బందోబస్తు

పెద్దగట్టు జాతరను పురస్కరించుకొని నిర్వహించిన దిష్టి పూజలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ పర్యవేక్షణలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ మేరకు డీఎస్పీ రవి సిబ్బందికి పలు సలహాలు, సూచనలు ఇచ్చారు. ఇద్దరు సీఐలు, 11 మంది ఎస్ఐలు, పోలీస్ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. జాతర ముగిసే వరకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశామన్నారు.
Similar News
News December 5, 2025
కృష్ణా: మెగా PTM-3.0 కార్యక్రమానికి సర్వం సిద్ధం

ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా శుక్రవారం 2500లకు పైగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో మెగా PTM-3.0 నిర్వహించనున్నారు. ప్రజాప్రతినిధులు, తల్లిదండ్రులు పాల్గొని విద్యార్థుల ప్రగతిని తెలుసుకోనున్నారు. గతంలో మాదిరిగానే ఈసారీ భారీ స్పందన వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. విజయవాడ గాంధీ హైస్కూల్కు దాతలు ఉచితంగా 6 లాప్టాప్లను అందించారు. జిల్లాలో ఈ కార్యక్రమం కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
News December 5, 2025
రెండేళ్లలో 6 గ్యారంటీలకు ₹76,382 కోట్లు

TG: రెండేళ్ల పాలనలో 6 గ్యారంటీల అమలుకు ₹76,382 కోట్లు ఖర్చు చేసినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. ఆర్టీసీలో మహిళల ఉచిత ప్రయాణానికి ₹8,402Cr, ₹500కే గ్యాస్ సిలిండర్ స్కీమ్కు ₹700Cr, గృహజ్యోతి ₹3,438Cr, ఇందిరమ్మ ఇళ్లకు ₹3,200 Cr, ఆరోగ్యశ్రీ ₹3,000 Cr, రైతు భరోసా ₹20,616Cr, యంగ్ ఇండియా స్కూళ్లకు ₹15,600Cr ఖర్చు చేసినట్లు వెల్లడించింది. రెండేళ్లలో 61,379 ఉద్యోగాలు ఇచ్చినట్లు పేర్కొంది.
News December 5, 2025
కూసుమంచిలో అత్యధిక జీపీలు, వార్డులు

ఖమ్మం జిల్లాలో అత్యధిక జీపీలు, వార్డులు కూసుమంచి మండలంలో ఉన్నాయి. మండలంలో 41 జీపీలకు గాను 364 వార్డులు ఉన్నాయి. ఆ తర్వాత సింగరేణి మండలంలో 41 జీపీలు, 356 వార్డులు, తిరుమలాయపాలెం మండలంలో 40 జీపీలు 356 వార్డులు ఉన్నాయి. కూసుమంచి మండలంలో మొత్తం 50,357 మంది ఓటర్లకు గాను 24,321 మంది పురుషులు, 26,035 మంది మహిళలు ఇతరులు ఒకరు ఓటరుగా నమోదయ్యాయి.


