News February 11, 2025
పెద్దగట్టు జాతరకు ట్రాఫిక్ ఆంక్షలు: SRPT SP

తెలంగాణలో రెండో అతిపెద్ద జాతర అయిన పెద్దగట్టు జాతర సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నట్లు SRPT SP సన్ ప్రీత్ సింగ్ తెలిపారు. HYD-విజయవాడ వెళ్లే వాహనాలు నార్కట్ పల్లి, నల్గొండ, మిర్యాలగూడ, హుజూర్నగర్, కోదాడ మీదుగా వెళ్లాలని సూచించారు. HYD-KMM వెళ్లే వాహనాలను టేకుమట్ల మీదుగా వెళ్లేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఈ నెల 16 నుంచి ఆంక్షలు అమల్లోకి వస్తాయని, రూట్ మ్యాపును సిద్ధం చేశామన్నారు.
Similar News
News November 18, 2025
రేపు పుట్టపర్తికి వస్తున్నా: PM మోదీ

సత్యసాయి బాబా 100వ జయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు తాను రేపు పుట్టపర్తికి వస్తున్నానని ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. సమాజ సేవ, ఆధ్యాత్మికత కోసం బాబా చేసిన కృషి తరతరాలకు మార్గదర్శకమని ప్రధాని పేర్కొన్నారు. గతంలో బాబాతో తనకు అనేక సందర్భాల్లో సంభాషించే అవకాశం లభించిందని, ఆ అనుభవాలను గుర్తు చేసుకున్నారు.
News November 18, 2025
కామారెడ్డి: ఇళ్ల లక్ష్యాలు పకడ్బందీగా సాధించాలి: కలెక్టర్

కామారెడ్డి కలెక్టరేట్లో మంగళవారం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పురోగతిపై జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. మాచారెడ్డి, లింగంపేట, నాగిరెడ్డిపేట్ మండలాల ఎంపీడీవోలతో జరిగిన ఈ సమావేశంలో.. మండలాల వారీగా నిర్మాణాల పురోగతిని తెలుసుకున్నారు. లక్ష్యాలను వంద శాతం చేరుకునేలా ప్రత్యేక చొరవ తీసుకుని, పనులను వేగవంతం చేయాలని ఎంపీడీవోలకు కలెక్టర్ సూచించారు.
News November 18, 2025
సిరిసిల్లలో పత్తి కొనుగోళ్లు ప్రారంభం

రాజన్న జిల్లా జిన్నింగ్ మిల్ నిర్వాహకులు ప్రభుత్వ అధికారులతో చర్చల అనంతరం సమ్మె విరమించారు. ప్రతి మిల్లులో పత్తి కొనుగోలుకు అవకాశం ఇవ్వాలని, ఎకరాకు 12 క్వింటాళ్ల కొనుగోలుకు అనుమతించాలనే ప్రధాన డిమాండ్లపై ఏకాభిప్రాయం కుదిరినట్లు మిల్లర్ల అసోసియేషన్ తెలిపింది. దీంతో జిల్లాలో మంగళవారం సాయంత్రం పత్తి కొనుగోళ్లు తిరిగి ప్రారంభమయ్యాయి.


