News January 31, 2025

పెద్దగట్టు జాతరకు నిధులు కేటాయించాలని సీఎంకు వినతి

image

సూర్యాపేట జిల్లాలో నిర్వహించే పెద్దగట్టు (గొల్లగట్టు) జాతరకు భారీగా నిధులు కేటాయించాలని సీఎం రేవంత్ రెడ్డిని నల్లగొండ ఎంపీ రఘువీర్ రెడ్డి కోరారు. గురువారం హైదరాబాద్‌లో సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి ఈ మేరకు విన్నవించారు. స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి ఫిబ్రవరి 16 నుంచి పెద్దగట్టు జాతర ప్రారంభం కానున్న నేపథ్యంలో ఏర్పాట్లకు కావాల్సిన నిధుల ప్రణాళికలను రూపొందించాలని అధికారులను ఆదేశించారు.

Similar News

News October 21, 2025

పార్వతీపురం మన్యం: మీ సేవలు మరువం..!

image

రేయింబవళ్లు కష్టపడి శాంతిభద్రతలను కాపాడే రక్షభటులకే కొన్ని సందర్భాల్లో రక్షణ కరువవుతోంది. పార్వతీపురం జిల్లాలో సీఐ ముద్దాడ గాంధీ, ఏ.ఆర్ కానిస్టేబుల్ షేక్ ఇస్మాయిల్, సివిల్ కానిస్టేబుల్లు బి.శ్రీరాములు, సీహెచ్.చిరంజీవిరావు, ఎస్.సూర్యనారాయణ విధుల్లో ఉండగా ప్రాణాలు విడిచారు. నేడు ‘పోలీసు అమరవీరుల సమస్మరణ దినోత్సవం’ సందర్భంగా వారి త్యాగాలను స్మరించుకుంటూ పార్వతీపురంలో స్మృతి పరేడ్ నిర్వహించనున్నారు.

News October 21, 2025

వారితో అప్రమత్తంగా ఉండండి: ఏసీపీ దామోదర్

image

విజయవాడ సెంట్రల్ ఏసీపీ దామోదర్ ప్రజలకు ముఖ్య సూచన చేశారు. పని మనుషులు, కేర్‌ టేకర్లను నియమించుకునే ముందు వారి నేర చరిత్రను తప్పనిసరిగా తెలుసుకోవాలని కోరారు. ఇటీవల కన్సల్టెన్సీల ద్వారా వచ్చే సిబ్బంది నేరాలకు పాల్పడుతున్న సంఘటనలు వెలుగు చూస్తున్నాయని చెప్పారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, ఏమైనా అనుమానాలు ఉంటే తక్షణమే పోలీసుల సహాయం తీసుకోవాలని ఆయన సూచించారు.

News October 21, 2025

బ్రేకప్‌పై రష్మిక ఏమన్నారంటే?

image

రిలేషన్‌షిప్ బ్రేకప్ అయితే అమ్మాయిలకే బాధ ఎక్కువగా ఉంటుందని స్టార్ హీరోయిన్ రష్మిక అన్నారు. అమ్మాయిలతో పోలిస్తే అబ్బాయిలే ఎక్కువ బాధపడతారనే ప్రచారాన్ని తాను అంగీకరించనని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. బాధను వ్యక్తపరిచేందుకు తాము గడ్డం పెంచలేమని, మందు తాగలేమని అభిప్రాయపడ్డారు. లోలోపల అమ్మాయిలకే బాధ ఎక్కువగా ఉంటుందని, బయటకు చూపించలేరని చెప్పారు. ఆమె నటించిన ‘ది గర్ల్ ఫ్రెండ్’ నవంబర్ 7న రిలీజ్ కానుంది.