News February 2, 2025
పెద్దగట్టు జాతరకు నిధులు విడుదల

దూరజ్‌పల్లి లింగమంతుల స్వామి (పెద్దగట్టు) జాతరకు ప్రభుత్వం శనివారం నిధులు విడుదల చేసింది. జాతర ఏర్పాట్ల కోసం రూ.5 కోట్లు కేటాయిస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 16 నుంచి 20వ తేదీ వరకు జాతర జరగనుంది. నేడు ఆలయం వద్ద దిష్టి పూజ నిర్వహించనున్నారు. ప్రతి రెండేళ్లకు ఒకసారి ఘనంగా జరుగుతుంది. వివిధ రాష్ట్రాల నుంచి లక్షలాది మంది తరలివస్తారు. దీంతో పెద్దగట్టు పరిసరాలు కుంభమేళాను తలపిస్తాయి.
Similar News
News November 4, 2025
ADB: ఉన్నత చదువులకు కస్తూర్బా బాట..!

కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు విద్యార్థులకు ఉన్నత విద్యకు మార్గం చూపుతున్నాయి. ఇంటర్‌తో పాటు ఎంసెట్, నీట్, జేఈఈ పోటీ పరీక్షలకు ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నేరడిగొండ, తలమడుగు, ఆసిఫాబాద్, కాగజ్ నగర్, మంచిర్యాల, బెల్లంపల్లి, దిలావర్పూర్, లక్ష్మణచాంద కేజీబీవీల్లో ఈ శిక్షణను ప్రస్తుతం అమలు చేస్తున్నారు. ఉదయం, సాయంత్రం విద్యార్థుల సందేహాలు నివృత్తి చేస్తున్నారు.
News November 4, 2025
తెనాలి: ప్రభుత్వ పథకాల పేరుతో వృద్ధురాళ్లకు టోకరా

ప్రభుత్వ పథకం కింద తక్కువ ధరకు టీవీ, ఫ్రిడ్జ్ వంటి వస్తువులు ఇస్తామని, తీసుకోకుంటే పథకాలు ఆగిపోయాయని తెనాలి వీఎస్సార్ కళాశాల రోడ్డులో నివసించే 60 ఏళ్ల బొద్దులూరి సీతామహాలక్ష్మికి, గంగానమ్మపేటకు చెందిన లింగమల్లు ఆమనికి గుర్తు తెలియని వ్యక్తులు టోకరా వేశారు. ఒకరి వద్ద రూ.40 వేలు, మరొకరి వద్ద రూ. 30 వేలు తీసుకుని పత్తాలేకుండా పోయారు. మోసపోయామని గ్రహించిన ఇద్దరూ తెనాలి టూ టౌన్ పోలీసులను ఆశ్రయించారు.
News November 4, 2025
WGL: వారి బెనిఫిట్స్ బకాయిలు రూ.3,270 కోట్లు!

ఉమ్మడి జిల్లాలో రిటైర్డ్ ఉద్యోగులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 19 నెలల్లో 654 మంది రిటైర్ అయ్యినా, వారికి రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ రూ.3,270 కోట్లు ఇంకా చెల్లించలేదు. జీపీఎఫ్, గ్రాట్యుటీ, కమ్యూటేషన్, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్, బీమా తదితర ప్రయోజనాలు అందక రిటైర్డ్ ఉద్యోగులు ఆర్థికంగా కుంగిపోతున్నారు.“రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వండి మహాప్రభో” అంటూ వినతి పత్రాలు, కోర్టు పోరాటాలు చేస్తున్నారు.


