News February 2, 2025

పెద్దగట్టు జాతరకు నిధులు విడుదల

image

దూరజ్‌పల్లి లింగమంతుల స్వామి (పెద్దగట్టు) జాతరకు ప్రభుత్వం శనివారం నిధులు విడుదల చేసింది. జాతర ఏర్పాట్ల కోసం రూ.5 కోట్లు కేటాయిస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 16 నుంచి 20వ తేదీ వరకు జాతర జరగనుంది. నేడు ఆలయం వద్ద దిష్టి పూజ నిర్వహించనున్నారు. ప్రతి రెండేళ్లకు ఒకసారి ఘనంగా జరుగుతుంది. వివిధ రాష్ట్రాల నుంచి లక్షలాది మంది తరలివస్తారు. దీంతో పెద్దగట్టు పరిసరాలు కుంభమేళాను తలపిస్తాయి.

Similar News

News February 12, 2025

ప్రధానికి బెదిరింపు కాల్

image

PM మోదీ టార్గెట్‌గా బెదిరింపు కాల్ వచ్చిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆయన విదేశీ పర్యటన నేపథ్యంలో ప్రయాణిస్తున్న విమానాన్ని లక్ష్యంగా చేసుకుంటామని ఓ దుండగుడు బెదిరింపులకు పాల్పడ్డాడు. అప్రమత్తమైన అధికారులు భద్రతా సిబ్బందికి సమాచారమివ్వడంతో కాల్ చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. దుండగుడిని మతిస్థిమితం సరిగ్గా లేని వ్యక్తిగా గుర్తించారు. మోదీ పర్యటనకు ముందే ఈ కాల్ వచ్చినట్లు తెలిపారు.

News February 12, 2025

కాగజ్‌నగర్‌: అనుమానంతో యువకుడిపై దాడి

image

పట్టణంలోని ద్వారకా నగర్‌కు చెందిన అక్రమ్ ఖాన్ పై మంగళవారం రాత్రి పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాదారులు దాడికి పాల్పడ్డారు. చిన్న మసీద్ సమీపంలో ఉన్న అతడిపై ముగ్గురు వ్యక్తులు దాడి చేసి చితకబాదారు. మంగళవారం పోలీసులు 208 క్వింటాళ్ల బియ్యం స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. కాగా ఆ బియ్యాన్ని అక్రమ్ ఖాన్ పట్టించాడనే అనుమానంతో దాడి చేసినట్లు స్థానికులు తెలిపారు.

News February 12, 2025

కోయిలకొండ: కరెంట్ షాక్ తగిలి వ్యక్తికి తీవ్ర గాయాలు

image

కరెంట్ పని చేస్తుండగా.. ఓ వ్యక్తికి షాక్ తగిలిన ఘటన బిజినేపల్లిలో చోటచేసుకుంది. స్థానికుల వివరాలిలా.. కోయిలకొండ మండలం లింగుపల్లి గ్రామానికి చెందిన బాబు(38) బిజినేపల్లిలో కరెంటు పని చేస్తుండగా ఒక్కసారిగా షాక్ తగిలి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే కుటుంబసభ్యులు ఓ ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి తీవ్రంగా ఉండడంతో అక్కడి నుంచి HYDకి పంపించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

error: Content is protected !!