News February 20, 2025

పెద్దగట్టు జాతరకు వెళ్లి వస్తుండగా ఘోర ప్రమాదం

image

సూర్యాపేట జిల్లాలో గురువారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. ఇద్దరు యువకులు పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతరకు బైక్‌పై వెళ్లి వస్తుండగా సూర్యాపేట రూరల్ పరిధి కేసారం గ్రామం సమీపంలోని వాగులో పడ్డారు. ఈ ప్రమాదంలో కాసరాబాద్ గ్రామానికి చెందిన సుధీర్(21) మృతి చెందగా, సంపత్‌కు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుణ్ని ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

Similar News

News February 26, 2026

తిరుమలలో నేటి నుంచి తెప్పోత్సవాలు

image

తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు నేటి నుంచి ప్రారంభం అవుతాయి. మార్చి 2వ తేదీ వరకు వైభవంగా జరగనున్నాయి. ప్రతిరోజు రాత్రి 7 నుంచి 8 గంటల వరకు పుష్కరిణిలో స్వామివారు దర్శనమిస్తారు. మొదటి రోజు శ్రీరామచంద్రమూర్తి, రెండో రోజు శ్రీకృష్ణస్వామి, చివరి 3 రోజులు మలయప్పస్వామి వారు తెప్పలపై విహరిస్తారు. ఈ వేడుకల కారణంగా ఫిబ్రవరి 26 నుంచి మార్చి 2 వరకు కొన్ని ప్రత్యేక సేవలను TTD రద్దు చేసింది.

News February 26, 2026

జనగామ: ముక్కుసూటి మనిషి.. బీఆర్ఎస్‌కు చెక్ పెట్టేందుకేనా?

image

జనగామలో ఇక గేమ్ మొదలుకానుంది. కొత్త కలెక్టర్‌గా నియమితులైన సందీప్ కుమార్ ఝా ముక్కుసూటి మనిషిగా పేరుంది. అధికార పక్షమైనా, విపక్షమైనా ఎవరి మాట వినకుండా ఏదైనా పనిని ముక్కుసూటిగా పనిచేసే స్వభావం ఆయనది. ఈయన గతంలో ఖమ్మం మున్సిపల్ కమిషనర్, సిరిసిల్ల కలెక్టర్‌గా పనిచేశారు. కాగా జనగామలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉండడంతో చెక్ పెట్టేందుకే ఆయన్ను రంగంలోకి దించినట్టు సమాచారం.

News February 26, 2026

BREAKING: చుంచుపల్లి: భారీగా గంజాయి పట్టివేత

image

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలంలో గురువారం రూ.2 కోట్ల విలువైన 400 కేజీల గంజాయి పట్టుబడింది. పోలీసులు వాహన తనిఖీలు చేస్తుండగా కంటైనర్ లారీలో సినీ ఫక్కీలో గంజాయిని తరలిస్తుండగా చుంచుపల్లి మండలంలోని కంకర మిల్లు వద్ద పోలీసులు పట్టుకున్నారు. కాగా పట్టుబడిన గంజాయి తరలిస్తున్న వ్యక్తుల పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. పోలీస్ శాఖ అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.