News February 5, 2025

పెద్దగట్టు జాతరపై అధికారులతో కలెక్టర్ సమీక్ష

image

చివ్వెంల మండలం దురాజ్‌పల్లిలోని పెద్దగట్టు జాతరపై అధికారులతో బుధవారం జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని, భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూసుకోవాలని, జాతరకు వచ్చే భక్తులకు మంచినీటి వసతి, వైద్య సేవలు అందించాలని అధికారులకు సూచించారు. వారి వెంట పెద్దగట్టు ఛైర్మన్ నర్సయ్య, అదనపు కలెక్టర్, ఆర్డీవో, డీఎస్పీ రవి ఉన్నారు.

Similar News

News November 4, 2025

పిల్లలను జర్మనీకి పంపిస్తున్నారా?

image

జర్మనీకి వెళ్తే సెటిల్ అయిపోవచ్చని అనుకుంటున్న వారికి అక్కడి NRIలు కీలక సూచనలు చేస్తున్నారు. అక్కడ పరిస్థితులు మరింత దారుణంగా ఉన్నాయని ఉద్యోగాలు లేక చాలామంది వెళ్లిపోతున్నట్లు చెబుతున్నారు. ‘కేవలం ఇక్కడి NRIలు చేసే రీల్స్ చూసి గుడ్డిగా రావద్దు. కనీసం 10 మంది అభిప్రాయాలు తీసుకోండి. జర్మన్ భాష నేర్చుకోగలిగితే ఇక్కడ స్థిరపడటం సులభం. కష్టపడటానికి సిద్ధమైతేనే ఈ దేశాన్ని ఎంచుకోండి’ అని సూచిస్తున్నారు.

News November 4, 2025

NZB: డాక్టర్, రియల్టర్ వేధిస్తున్నారని మహిళ ఫిర్యాదు

image

NZB నగరానికి చెందిన ఓ ప్రముఖ డెంటల్ వైద్యుడు, ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడుతున్నారని ఓ మహిళ ఆరోపించింది. తనకు వీడియో కాల్స్ చేస్తూ అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని బాధితురాలు సోమవారం CP సాయి చైతన్యకు ఫిర్యాదు చేశారు. ఓ ప్రైవేట్ సంస్థలో పని చేసేదాన్నని, వారి వేధింపులు తాళలేక రెండేళ్ల క్రితం జాబ్ మానేసినట్లు చెప్పింది. తరుచూ ఫోన్లు చేసి వేధిస్తున్నారని చర్యలు తీసుకోవాలని కోరారు.

News November 4, 2025

ఎస్.కోట విలీనానికి ‘ఎస్’ అంటారా?

image

జిల్లాల పునర్విభజన నేపథ్యంలో ఎస్.కోట నియోజకవర్గం కూటమి ప్రజాప్రతినిధుల హామీ తెరపైకి వచ్చింది. ఎన్నికల ప్రచారంలో విశాఖ ఎంపీ, స్థానిక ఎమ్మెల్యే విజయనగరం జిల్లాలో ఉన్న ఈ నియోజకవర్గాన్ని విశాఖ జిల్లాలో విలీనం చేస్తామని హామీ ఇచ్చారు. పలువురు రాజకీయ నేతలు, ప్రజా సంఘాల వారు మంత్రివర్గ ఉపసంఘానికి వినతులు సమర్పించారు. స్థానిక కూటమి నేతల ప్రపోజల్‌కు అధిష్ఠానం ‘ఎస్’ అంటుందో ‘నో’ అంటుందో చూడాలి.