News February 5, 2025
పెద్దగట్టు జాతరపై అధికారులతో కలెక్టర్ సమీక్ష

చివ్వెంల మండలం దురాజ్‌పల్లిలోని పెద్దగట్టు జాతరపై అధికారులతో బుధవారం జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని, భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూసుకోవాలని, జాతరకు వచ్చే భక్తులకు మంచినీటి వసతి, వైద్య సేవలు అందించాలని అధికారులకు సూచించారు. వారి వెంట పెద్దగట్టు ఛైర్మన్ నర్సయ్య, అదనపు కలెక్టర్, ఆర్డీవో, డీఎస్పీ రవి ఉన్నారు.
Similar News
News March 6, 2026
వీధి కుక్కల బెడదకు ప్రత్యేక కార్యక్రమాలు: ఖమ్మం కలెక్టర్

ఖమ్మం జిల్లాలో 10 ప్రత్యేక అంశాలతో 99 రోజుల కార్యాచరణ చేపట్టడం జరిగిందని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి వెల్లడించారు. ఏప్రిల్ 2న గ్రామ స్థాయి, ఏప్రిల్ 16న మండల స్థాయి, మే 2న నియోజకవర్గ స్థాయిలో, మే 22న జిల్లా స్థాయిలో, జూన్ 2న రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. అటు ప్రధాన సమస్య అయిన వీధి కుక్కల బెడద తొలగించేందుకు MAR 14న ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయని పేర్కొన్నారు.
News March 6, 2026
ప్రజాదర్బార్ వినతులను సత్వరమే పరిష్కరించాలి: కలెక్టర్

నియోజకవర్గ స్థాయిలో నిర్వహించే ‘ప్రజాదర్బార్’ వినతులను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని కలెక్టర్ వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. వీటిని నియోజకవర్గ విజన్ యూనిట్ సిబ్బంది ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తున్న 10 సూత్రాల పథకాల్లో 100 శాతం లక్ష్యాలను సాధించేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆమె పేర్కొన్నారు.
News March 6, 2026
ఖమ్మం జిల్లాలో 99 డేస్ యాక్షన్ ప్లాన్ షెడ్యూల్

☆ MAR 6 నుంచి MAR 15 వరకు పారిశుద్ధ్యం, ఫైల్స్ క్లీయరెన్స్
☆ APR 6 నుంచి APL 11 వరకు వైద్య శాఖ
☆ APR13- 18 వరకు రోడ్ సేఫ్టీ
☆ APR 20-26 వరకు SC, ST, BC, మైనారిటీ సంక్షేమం, హౌసింగ్
☆ APR 27 నుంచి MAY 2 వరకు చైల్డ్ సేఫ్టీ, డ్రగ్స్ వ్యతిరేక కార్యక్రమాలు
☆ మే 4-10 వరకు అగ్రికల్చర్
☆ మే 11-16 వరకు విద్య
☆ మే 18-23 వరకు క్రీడలు
☆ మే 25-30 వరకు మహిళా సంక్షేమం
☆ జూన్ 1-12 వరకు పర్యావరణం


