News February 18, 2025
పెద్దగట్టు జాతరలో స్వల్ప తొక్కిసలాట!

పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతరలో మంగళవారం రాత్రి స్వల్ప తొక్కిసలాట జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మర్రిచెట్టుకు సమీపంలో పోలీస్ పాయింట్ వద్ద మున్సిపల్ చెత్త ట్రాక్టర్ రాకతో భక్తులు ఒకరినొకరు నెట్టుకోవటంతో స్వల్ప తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఎవరికి ప్రమాదం జరగలేదని స్థానికులు వెల్లడించారు. చిన్నారులు కాస్త ఇబ్బంది పడ్డారు.
Similar News
News March 25, 2025
నేరస్థులకు శిక్ష పడేలా చూడాలి: నల్గొండ ఎస్పీ

నల్గొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్లకు, కోర్టు డ్యూటీ ఆఫీసర్లకు అభినందన సభ నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ.. గడిచిన సంవత్సర కాలంలో ఒకరికి ఉరి, 17 మందికి జీవిత ఖైదు విధించడం జరిగిందని తెలిపారు. నిందితులను దోషులుగా నిరూపించి శిక్షలు పడేలా చేయాలని కోరారు. కోర్టు అధికారులు ప్రాసిక్యూటర్ల సమన్వయంతో న్యాయ సలహాలు అడిగి పనిచేయాలన్నారు. నిందితులను సకాలంలో కోర్టులో హాజరుపరచాలన్నారు.
News March 25, 2025
నల్గొండ: మరొకరికి మంత్రి పదవి!

మంత్రివర్గ విస్తరణలో భాగంగా రాజగోపాల్ రెడ్డికి చోటు కల్పిస్తారన్న చర్చ నడుస్తోంది. ఇటీవల అద్దంకి దయాకర్‌ను MLC పదవి వరించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే SRPTకి చెందిన రమేశ్ రెడ్డిని పర్యాటక శాఖ ఛైర్మన్‌గా నియమించింది. కాగా ఉమ్మడి జిల్లా నుంచి ఇప్పటికే మంత్రులుగా ఉత్తమ్, కోమటిరెడ్డి ఉన్నారు. దీంతో ప్రభుత్వంలో ఉమ్మడి జిల్లా ప్రాతినిధ్యం పెరిగినట్లైంది. జిల్లాకు మరో అమాత్య యోగముందా కామెంట్ చేయండి.
News March 25, 2025
ఉమ్మడి NLG జిల్లా నుంచే సన్న బియ్యం పంపిణీకి శ్రీకారం

రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీకి ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచే శ్రీకారం చుట్టనున్నారు. ఉగాది పర్వదినాన సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా హుజూర్ నగర్‌లో రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీ పథకం ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా సభ ఏర్పాట్ల పనులు చకచకా జరుగుతున్నాయి. ఫణిగిరి గుట్టకు వెళ్లే రోడ్డులో సీఎం సభ ప్రాంగణం ఏర్పాటు చేయనున్నారు.