News February 16, 2025

పెద్దగట్టు జాతర.. ఈ రూట్లో ట్రాఫిక్ ఆంక్షలు

image

HYD నుంచి VJW, KMM వెళ్లే వాహనదారులకు SRPT పోలీసు యంత్రాంగం ఆంక్షలు విధించింది. తెలంగాణలో రెండో అతిపెద్ద జాతరైన SRPT పెద్దగట్టు నేపథ్యంలో ఆయా రూట్లో వాహనాలను మళ్లీస్తున్నారు. జాతర నేటి నుంచి ఐదు రోజుల పాటు కొనసాగనుంది. జాతరకు తెలంగాణతో సహా ఇతర రాష్ట్రాల ప్రజలు హాజరవుతారు. ఈ నేపథ్యంలో రద్దీ తగ్గే వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని పోలీసులు ప్రకటించారు.

Similar News

News October 18, 2025

పవన్-లోకేశ్ కాంబోలో సినిమా?

image

టాలీవుడ్‌లో క్రేజీ కాంబో సెట్ అవుతుందనే టాక్ వినిపిస్తోంది. నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ పవన్‌తో మూవీ లాక్ చేసుకుంది. ఆ అవకాశం తమిళ్ డైరెక్టర్ లోకేశ్ కనకరాజ్‌కు దక్కబోతోందని టాలీవుడ్‌లో టాక్ స్టార్ట్ అయ్యింది. అలాగే డైరెక్టర్ హెచ్.వినోద్ పేరు కూడా ఈ లిస్ట్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరిలో ఎవరో ఒకరితో పవన్ కళ్యాణ్ సినిమా చేయబోతున్నట్లు చెబుతున్నారు.

News October 18, 2025

NZB: దరఖాస్తులకు నేడే చివరి తేదీ

image

NZB జిల్లాలో మద్యం టెండర్లకు ప్రక్రియ కొనసాగుతోంది. మొత్తం 102 మద్యం దుకాణాలకు శుక్రవారం వరకు 1419 దరఖాస్తుల స్వీకరించినట్లు నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి తెలిపారు. నిజామాబాద్‌లో 492, బోధన్ 299, ఆర్మూర్ 260, భీమ్‌గల్ 171 దరఖాస్తులు వచ్చాయన్నారు. శనివారంతో టెండర్ల ప్రక్రియ పూర్తి అవుతుందన్నారు. చివరి రోజు దరఖాస్తులు ఎక్కువ సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది.

News October 18, 2025

నర్వ: నీటి సంపులో పడి చిన్నారి మృతి

image

నర్వ మండల కేంద్రంలో శుక్రవారం రాత్రి 18 నెలల చిన్నారి నీటి సంపులో పడి మృతి చెందింది. స్థానికుల వివరాలు.. శివరాం, పావనిల కూతురు రాజేశ్వరి (18 నెలలు)ని నానమ్మ పక్కన కూర్చోబెట్టి గడ్డి తొలగిస్తుండగా, ఇంటి పక్కన ఉన్న సంపులో రాజేశ్వరి పడింది. కొద్దిసేపటికి చిన్నారి కనిపించకపోవటంతో వెతికారు. సుమారు గంట తర్వాత సంపులో చిన్నారి మృతిచెంది కనిపించటంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.