News February 16, 2025
పెద్దగట్టు జాతర.. ఈ రూట్లో ట్రాఫిక్ ఆంక్షలు

HYD నుంచి VJW, KMM వెళ్లే వాహనదారులకు SRPT పోలీసు యంత్రాంగం ఆంక్షలు విధించింది. తెలంగాణలో రెండో అతిపెద్ద జాతరైన SRPT పెద్దగట్టు నేపథ్యంలో ఆయా రూట్లో వాహనాలను మళ్లిస్తున్నారు. జాతర నేటి నుంచి ఐదు రోజుల పాటు కొనసాగనుంది. జాతరకు తెలంగాణతో సహా ఇతర రాష్ట్రాల ప్రజలు హాజరవుతారు. ఈ నేపథ్యంలో రద్దీ తగ్గే వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని పోలీసులు ప్రకటించారు.
Similar News
News December 6, 2025
నెరవేరిన హామీ.. 3KM సాష్టాంగ నమస్కారాలు

ప్రజలకు ఇచ్చిన హామీ నెరవేరడంతో 3కి.మీ మేర సాష్టాంగ నమస్కారాలు చేస్తూ ఓ MLA ఆలయానికి చేరుకున్నారు. మహారాష్ట్రలోని ఔసా BJP MLA అభిమన్యు కొన్ని నెలల కిందట కిల్లారి గ్రామంలో పర్యటించారు. అక్కడ మూతబడిన షుగర్ ఫ్యాక్టరీ మళ్లీ ప్రారంభమైతే నీలకంఠేశ్వర ఆలయానికి సాష్టాంగ నమస్కారాలతో వస్తానని మొక్కుకున్నారు. ఇటీవల ఆ ఫ్యాక్టరీ మొదలవడంతో మొక్కు తీర్చుకున్నారు. ఆ కర్మాగారంలో ఉత్పత్తయిన చక్కెరతో అభిషేకం చేశారు.
News December 6, 2025
డిసెంబర్ 17 వరకు ‘ప్రజావాణి’ రద్దు: సూర్యాపేట కలెక్టర్

గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రవర్తనా నియమావళి (కోడ్) అమలు కారణంగా ప్రతి సోమవారం జరిగే ‘ప్రజావాణి’ కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తెలిపారు. డిసెంబర్ 17 వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందని, ఆలోపు ఫిర్యాదులు ఇవ్వడానికి ప్రజలు కలెక్టరేట్కు రావద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. కోడ్ ముగిసిన వెంటనే కార్యక్రమం తిరిగి యథావిధిగా మొదలవుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు.
News December 6, 2025
గుంటూరులో ప్రకాశం జిల్లా వాసి అరెస్ట్

మహిళ ఫొటోలను మార్ఫింగ్ చేసి FBలో దుష్ప్రచారం చేస్తున్న ప్రకాశం జిల్లా వాసిని గుంటూరు జిల్లా పట్టాభిపురం పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ వెంకటేశ్వర్లు వివరాల మేరకు.. గుంటూరుకు చెందిన ఓ మహిళ ఫొటోలను గిద్దలూరు మండలం కృష్ణంశెట్టిపల్లికి చెందిన నాగిరెడ్డి మధుసూదన్ రెడ్డి మార్ఫింగ్ చేసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. ఆ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు సీఐ తెలిపారు.


