News February 16, 2025

పెద్దగట్టు జాతర.. ఈ రూట్లో ట్రాఫిక్ ఆంక్షలు

image

HYD నుంచి VJW, KMM వెళ్లే వాహనదారులకు SRPT పోలీసు యంత్రాంగం ఆంక్షలు విధించింది. తెలంగాణలో రెండో అతిపెద్ద జాతరైన SRPT పెద్దగట్టు నేపథ్యంలో ఆయా రూట్లో వాహనాలను మళ్లిస్తున్నారు. జాతర నేటి నుంచి ఐదు రోజుల పాటు కొనసాగనుంది. జాతరకు తెలంగాణతో సహా ఇతర రాష్ట్రాల ప్రజలు హాజరవుతారు. ఈ నేపథ్యంలో రద్దీ తగ్గే వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని పోలీసులు ప్రకటించారు.

Similar News

News March 6, 2026

ముంబై న్యూ జెర్సీలో హిట్‌మ్యాన్

image

టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ IPL-2026కు ప్రిపేర్ అవుతున్నారు. తాజాగా ముంబై ఇండియన్స్ న్యూ జెర్సీలో ఫొటోలకు పోజులిచ్చారు. కేవలం వన్డేలు మాత్రమే ఆడుతున్న రోహిత్.. ఐపీఎల్ కోసం ఇప్పటికే ప్రాక్టీస్ ప్రారంభించారు. గతంతో పోలిస్తే ఫుల్ ఫిట్‌నెస్ సాధించిన హిట్‌మ్యాన్.. ప్రత్యర్థులపై ఎలా చెలరేగుతారో చూడాలి. మార్చి 28 నుంచి ఐపీఎల్ ప్రారంభం అవుతుందని క్రీడావర్గాలు వెల్లడించాయి.

News March 6, 2026

సంగారెడ్డి: జిల్లాస్థాయికి ‘వినూత్న హెల్మెట్’

image

వట్పల్లి మండలం పోతులబోగూడ మోడల్ స్కూల్ విద్యార్థి సాయికృష్ణ రూపొందించిన వినూత్న హెల్మెట్ జిల్లా స్థాయి ప్రదర్శనకు ఎంపికైంది. బైక్ వెనుక కూర్చున్న వారు మాట్లాడే మాటలు స్పష్టంగా వినిపించేలా ‘మాగ్నిఫర్వర్’ సాంకేతికతతో దీన్ని తయారు చేశారు. ఈ ఆవిష్కరణతో వాహనదారులు వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం ఉండదని, తద్వారా రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయని సాయి వివరించారు. విద్యార్థి ప్రతిభను ప్రిన్సిపల్ అభినందించారు.

News March 6, 2026

హనుమకొండ జిల్లాలో ప్రత్యేక వైద్య శిబిరాలు: డీఎంహెచ్‌ఓ

image

హనుమకొండ జిల్లాలో ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా వైద్య శిబిరాలు ప్రారంభమయ్యాయి. నేటి నుంచి జూన్ 12 వరకు నాలుగు దశల్లో వైద్య పరీక్షలు, అసంక్రమిత, సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పిస్తామని డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఏ.అప్పయ్య తెలిపారు. తొలి దశలో ఈనెల 6 నుంచి 31 వరకు స్పెషలిస్ట్ వైద్యులచే శిబిరాలు నిర్వహిస్తామన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.