News December 30, 2024
పెద్దగట్టు జాతర.. ఐదు రోజుల కార్యక్రమాలు ఇవే..

రాష్ట్రంలోనే అతిపెద్ద రెండో జాతర దురాజ్‌పల్లి (పెద్దగట్టు) జాతర. ఈ జాతర ప్రతి రెండేళ్లకోసారి జరుగుతుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 16 నుంచి 20 వరకు 5 రోజుల పాటు వైభవంగా జరగనుంది. మొదటి రోజు దేవరపెట్టే తరలింపు, 2వ రోజు కంకణ అలంకరణలు, 3వ రోజు స్వామివారి చంద్రపట్నం, 4వ రోజు దేవరపెట్టే కేసారం తరలింపు, 5వ రోజు మకరతోరణం తొలగింపుతో జాతర ముగుస్తుంది. ఇప్పటికే అధికారులు జాతరకు ఏర్పాట్లు చేస్తున్నారు.
Similar News
News July 8, 2025
NLG: రైతులకు యూరియా కష్టాలు ఇంకెన్నాళ్లు!?

నల్గొండ జిల్లాలోని రైతులకు మళ్లీ యూరియా కష్టాలు మొదలయ్యాయి. సకాలంలో యూరియా అందక రైతులు అవస్థలు పడుతున్నారు. వారం రోజులుగా జిల్లాలోని ప్రైవేట్ ఫర్టిలైజర్ డీలర్లు యూరియాను విక్రయించకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. సొసైటీలకు వచ్చిన యూరియా గంటల వ్యవధిలోనే అయిపోతుంది. ప్రైవేట్ డీలర్లు యూరియా అమ్మితే తమకు ఇబ్బందులు ఉండవని రైతులు పేర్కొంటున్నారు.
News July 8, 2025
నల్గొండ: నిరుద్యోగ యువకులకు హౌస్ వైరింగ్‌లో ఉచిత శిక్షణ

నల్గొండ శివారులోని SBI గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థలో గ్రామీణ నిరుద్యోగ యువకులకు హౌస్ వైరింగ్ (ఎలక్ట్రీషియన్) లో 31 రోజుల ఉచిత శిక్షణ అందిస్తున్నామని సంస్థ సంచాలకులు రఘుపతి తెలిపారు. శిక్షణ కాలంలో ఉచిత వసతి, భోజనం ఉంటుందన్నారు. 18 నుంచి 45 సం. లోపు ఉన్న వారు అర్హులని అన్నారు. ఆసక్తి గలవారు జూలై 9 లోపు సంస్థ ఆఫీసులో దరఖాస్తు చేసుకోవాలన్నారు.
News July 7, 2025
నల్గొండలో వ్యభిచార గృహంపై పోలీసుల దాడి..!

నల్గొండలో గుట్టుగా వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం మేరకు వన్ టౌన్ పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల్లో ఓ యువకుడు, ఇద్దరు మహిళలని అదుపులో తీసుకొని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా కలెక్టర్ ఆఫీస్ వెనకాల ఓ ఇంటిని కిరాయికి తీసుకొని గుట్టుచప్పుడు కాకుండా నడిపిస్తున్న వ్యవహారంపై నిఘా పెట్టారు. నమ్మదగిన సమాచారం మేరకు ఈ రోజు మెరుపు దాడులు చేసి పట్టుకున్నట్లు సమాచారం.