News February 18, 2025
పెద్దగట్టు: లింగమంతుల స్వామికి MLC కవిత బోనం

రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద జాతరైన దురాజ్‌పల్లి పెద్దగట్టు లింగమంతుల స్వామిని మంగళవారం ఎమ్మెల్సీ కవిత దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి బోనం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ మేరకు మహిళలు కవితకు మంగళహారతులతో స్వాగతం పలికారు. కవిత వెంట బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు లింగయ్య యాదవ్, మాజీ జడ్పీ ఛైర్ పర్సన్ గుజ్జ దీపిక యుగంధర్ రావు, బాలరాజు, మద్ది శ్రీనివాస్, నాయకులు పాల్గొన్నారు.
Similar News
News March 17, 2025
KMR: ఇంటర్ పరీక్షల్లో 411 మంది గైర్హాజరు

కామారెడ్డి జిల్లాలో ఇంటర్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయి. సోమవారం ఇంటర్ ప్రథమ సంవత్సరం భౌతిక శాస్త్రం, అర్ధశాస్త్రం పరీక్ష జరిగింది. జనరల్ గ్రూప్‌నకు సంబంధించి 8217 మంది పరీక్ష రాయాల్సి ఉండగా 7964 మంది పరీక్షకు హాజరయ్యారు. ఒకేషనల్ విభాగంలో 2086 మంది పరీక్ష రాయాల్సి ఉండగా, 158 మంది పరీక్షకు దూరంగా ఉన్నారని కామారెడ్డి జిల్లా ఇంటర్ నోడల్ అధికారి షేక్ సలాం తెలిపారు.
News March 17, 2025
పెద్దపల్లి: 196 మంది విద్యార్థుల గైర్హాజరు

పెద్దపల్లి జిల్లాలో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షకు 96.4 శాతం విద్యార్థులు హాజరయ్యారని ఇంటర్మీడియట్ జిల్లా అధికారి కల్పన తెలిపారు. ఫిజిక్స్ / ఎక్నామిక్స్ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని, ఈ పరీక్షకు 5,500 మంది హాజరు కావాల్సి ఉండగా 5,304 మంది హాజరు కాగా..196 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని తెలిపారు.
News March 17, 2025
నల్గొండ: రాముడి ఆలయ నిర్మాణానికి ముస్లిం వ్యక్తి విరాళం

నల్గొండ ప్రజలు భిన్నత్వంలో ఏకత్వం సూత్రం పాటిస్తారని మరోసారి రుజువు చేశాడు ఆ వ్యక్తి.. నల్గొండ జిల్లా నాంపల్లిలో నూతనంగా శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయం నిర్మిస్తున్నారు. కాగా ఈ ఆలయ నిర్మాణానికి నాంపల్లి మండలం తిరుమలగిరి వాసి మహమ్మద్ రవూఫ్ చోటే తన వంతు సాయంగా రూ.60,000 విరాళంగా అందజేశారు. దీంతో దేవాలయ కమిటీ ఛైర్మన్ కోట రఘునందన్, కమిటీ సభ్యులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.