News August 16, 2024
పెద్దపల్లిలో అగ్నిప్రమాదం
పెద్దపల్లి జిల్లా బోజన్నపేటలో శుక్రవారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గ్రామంలోని త్రివేణి రైస్‌మిల్లులో ఈ ప్రమాదం జరిగింది. షార్ట్‌సర్క్యూట్ కారణంతో గోదాంలో మంటలు చెలరేగాయి. సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటల్ని ఆర్పుతున్నారు.
Similar News
News September 20, 2024
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్
@ కథలాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన జగిత్యాల కలెక్టర్.
@ గన్నేరువరం మండలంలో ఉరివేసుకొని వ్యక్తి ఆత్మహత్య.
@ ఇల్లంతకుంట మండలంలో విద్యార్థికి పాముకాటు.
@ జగిత్యాల రూరల్ మండలంలో గేదెను ఢీకొని ద్విచక్ర వాహన దారుడు మృతి.
@ 30 ఏళ్ల పైబడిన వారికి బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహించాలన్న జగిత్యాల కలెక్టర్.
@ ఎల్లారెడ్డిపేట మండలంలో ప్రభుత్వ పాఠశాలలను తనిఖీ చేసిన సిరిసిల్ల కలెక్టర్.
News September 20, 2024
కరీంనగర్: వరి పంట వైపే మొగ్గు!
కరీంనగర్ జిల్లాలో పంటల నమోదు ప్రక్రియ పూర్తయింది. ఈ సర్వేలో ఈ సీజన్‌లో రైతులు వరి పంట వైపే మొగ్గు చూపినట్లు వెళ్లడైంది. క్షేత్రస్థాయిలో విస్తీర్ణ అధికారుల నుంచి ఏవోలు, ఏడీఏలు, డీఏవో వరకు లక్ష్యాలు నిర్దేశించుకొని చేపట్టిన సర్వేతో సాగు విస్తీర్ణం నిర్ధారణ చేశారు. జిల్లాలో 3,34,606 ఎకరాల సాగు భూమిలో అధిక శాతం 2,73,400 ఎకరాల్లో వరిసాగు చేపట్టినట్లు తెలిపారు.
News September 20, 2024
ఉమ్మడి KNR జిల్లాలో సర్వేయర్ల కొరత!
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సర్వేయర్ల కొరతతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. భూముల సర్వేకు దరఖాస్తు చేసుకున్నప్పటికీ పట్టించుకునేవారే కరువయ్యారు. సర్వేయర్ల నియామకం లేకపోవడంతో సర్వే కోసం దరఖాస్తు చేసుకున్నటువంటి వారు ఎదురు చూస్తున్నారు. కాగా, ఉమ్మడి జిల్లాలోని 4 జిల్లాల్లో 14,287 సర్వే దరఖాస్తులు దరఖాస్తులు పెండింగ్ ఉండటం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది.