News February 6, 2025
పెద్దపల్లిలో బాలికల బాలసదనం ప్రారంభం
పెద్దపల్లి జిల్లాలోని అనాథ బాలికలకు ప్రభుత్వం బాల సదనం ప్రారంభించిందని వయోవృద్ధుల శాఖ అధికారి పి.వేణుగోపాలరావు తెలిపారు. 6 నుంచి 18 సంవత్సరాల వయస్సులోపు అనాథ బాలికలను అడ్మిషన్ చేసుకుంటామని తెలిపారు. ఉచిత వసతి, విద్య అందిస్తామని పేర్కొన్నారు. ఉన్నత చదువులు చదివించి వివాహం కూడా జరిపిస్తామని తెలిపారు.
Similar News
News February 6, 2025
సీఎం నియోజకవర్గంలో విద్యార్థులు రోడ్డెక్కే పరిస్థితి: హరీశ్ రావు
మధ్యాహ్న భోజనం పథకం బాగాలేదని విద్యార్థులు వారి తల్లిదండ్రులు సాక్షాత్తు సీఎం సొంత నియోజకవర్గంలోనే రోడ్డు ఎక్కే పరిస్థితి నెలకొందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు ‘X’ లో విమర్శించారు. సీఎం నియోజకవర్గం కోస్లి మండలం చెన్నారం పాఠశాల విద్యార్థులు, తల్లిదండ్రులు రోడ్డెక్కిన ఫోటోలు పోస్ట్ చేశారు. విద్యాశాఖ మంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి పనితీరు ఎట్లా ఉందో కోస్లి పాఠశాల దుస్థితి చూస్తే తెలుస్తుందన్నారు.
News February 6, 2025
జగన్ ఇంటి వద్ద అగ్నిప్రమాదం.. TDP సంచలన ట్వీట్
AP: లిక్కర్ స్కాంపై ఉదయం సిట్ పడగానే రాత్రి తాడేపల్లి ప్యాలెస్ బయట తగలబడిన కాగితాలు, డైరీలు ఏంటని TDP ప్రశ్నించింది. ‘సిట్ తనవరకు వస్తుందని స్కాంకి సంబంధించి రాసుకున్న డాక్యుమెంట్లు తగలబెట్టారా? నిన్న సాయంత్రం జరిగితే ఇంకా CC ఫుటేజీ ఎందుకు బయటపెట్టలేదు? తానే తగలబెట్టి ప్రభుత్వంపై తోసేయడమేనా 2.0? ఎన్ని కుట్రలు చేసినా సిట్ వస్తుంది గెట్ రెడీ. స్టే ట్యూన్డ్ టు తాడేపల్లి ఫైల్స్’ అని ట్వీట్ చేసింది.
News February 6, 2025
ములుగు: రైతు భరోసా డబ్బులు జమ!
ములుగు జిల్లా వ్యాప్తంగా రైతుల ఖాతాలో రైతు భరోసా నిధులు జమవుతున్నాయి. బుధవారం మధ్యాహ్నం నుంచి అర్ధరాత్రి వరకు ఎకరం లోపు విస్తీర్ణం కలిగిన రైతుల ఖాతాలో రైతు భరోసా నిధులు జమ అయినట్లు రైతులు తెలిపారు. ఎకరం విస్తీర్ణానికి పైగా ఉన్న రైతులకు కూడా ఒకటి, రెండు రోజుల్లో భరోసా నిధులు జమవుతాయని ప్రభుత్వం వెల్లడించింది.