News February 12, 2025
పెద్దపల్లిలో మందకొడిగా పత్తి కొనుగోళ్లు!

పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని వ్యవసాయ పత్తి మార్కెట్‌లో కొనుగోళ్లు మందకొడిగా కొనసాగుతున్నాయి. పత్తికి కనీస మద్దతు ధర కూడా లభించకపోవడంతో రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత మార్కెట్‌లో క్వింటాల్ పత్తికి ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర కంటే తక్కువ ధర మాత్రమే అందుతోందని రైతులు వాపోతున్నారు. ప్రస్తుతం పత్తికి క్వింటాకు రూ.6,811 చొప్పున పలుకుతోంది.
Similar News
News March 20, 2025
గద్వాల: ‘పదో తరగతి విద్యార్థులకు సౌకర్యాలు కల్పించాలి’

గద్వాల జిల్లాలో మార్చ్ 21 – ఏప్రిల్ 4 వరకు 10వ తరగతి పరీక్షలు జరగనున్నాయి. సరైన సౌకర్యాలు లేని కారణంగా ప్రతి ఏడాది పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. పరీక్ష కేంద్రాల్లో ఫ్యాన్లు, సరైన మరుగుదొడ్లు లేకపోవడం, కొన్ని గ్రామాలకు బస్సు సౌకర్యం లేక, సమయానికి బస్సులు రాక సమస్యలను విద్యార్థులు ఎదుర్కొంటున్నారు. అధికారులు సమస్యలను గుర్తించి పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.
News March 20, 2025
SKLM: హాస్టళ్లలో నాణ్యత పర్యవేక్షణకు కమిటీ ఏర్పాటు

శ్రీకాకుళం జిల్లాలోని సంక్షేమ శాఖ హాస్టళ్లలో పరిశుభ్రత, పారిశుద్ధ్యం, ఆహార నాణ్యతను పర్యవేక్షించడానికి తొమ్మిది మందితో జిల్లా స్థాయి కమిటీని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ గురువారం ఏర్పాటు చేశారు. ఈ మేరకు ఆయన గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కమిటీ పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో ఉన్న అన్ని సంక్షేమ శాఖ హాస్టళ్లను పర్యవేక్షిస్తుంది. ఈ కమిటీకి కలెక్టరే ఛైర్మన్‌గా వ్యవహరిస్తారన్నారు.
News March 20, 2025
రేపు 49 మండలాల్లో వడగాలులు

AP: రేపు రాష్ట్రంలోని 49 మండలాల్లో <