News April 22, 2025
పెద్దపల్లిలో మందకొడిగా పత్తి విక్రయాలు

పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో పత్తి విక్రయాలు మందకొడిగా సాగుతున్నాయి. ఇటీవల వర్షాలు, ధర పెరుగుతుందన్న కారణంగా రైతులు మార్కెట్‌కు పత్తిని తక్కువగా తీసుకొస్తున్నారు. పత్తి విక్రయాలు స్వల్పంగా ధర పెరిగింది. ప్రస్తుతం పత్తి నాణ్యతను బట్టి క్వింటాల్‌కి రూ.6,800 నుంచి రూ.7,200 వరకు ధర పలుకుతోంది.
Similar News
News April 23, 2025
నిర్మల్: ఇంటర్ ఫలితాల్లో మారిన జిల్లాస్థానం

ఇంటర్మీడియట్ ప్రథమ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో జిల్లా ఉత్తీర్ణత స్థానంలో మార్పు సాధించింది. గతేడాది ఫస్టియర్‌లో నిర్మల్ జిల్లా 56% ఉత్తీర్ణతతో 16వ స్థానంలో నిలువగా ఈసారి 70.87%తో 17వ స్థానానికి చేరింది. సెకండియర్‌లో గతేడాది 66% ఉత్తీర్ణతతో 12వ స్థానంలో ఉండగా.. ఈసారి 58.78% ఉత్తీర్ణతతో పదో స్థానం కైవసం చేసుకుంది.
News April 23, 2025
జన్నారం: గంజాయి రవాణా చేస్తున్న నలుగురి అరెస్ట్

జన్నారం మండలం పొనకల్‌కు చెందిన రాజేశ్, సమీర్, వినయ్, మందపల్లికి చెందిన బాలాజీ గంజాయి రవాణా చేస్తుండగా పోలీసులు పట్టుకున్నట్లు ఎస్సై రాజవర్ధన్ తెలిపారు. వారి నుంచి1.020 కిలోల గంజాయి, రూ.50 వేల నగదు, హోండా యాక్టివా, సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. గంజాయి రవాణా చేసిన తాగిన చర్యలు తప్పవన్నారు.
News April 23, 2025
FY26లో 2-4% పెరగనున్న సిమెంట్ ధరలు!

దేశీయంగా ఈ ఆర్థిక సంవత్సరంలో సిమెంట్ డిమాండ్ 6.5-7.5% పెరగొచ్చని CRISIL అంచనా వేసింది. రుతుపవనాలు ఆశాజనకంగా ఉంటాయనే అంచనాలతో గ్రామీణ ప్రాంతాల్లో గృహాల నిర్మాణం ఊపందుకుంటుందని తెలిపింది. అలాగే మౌలిక సదుపాయాల వ్యయం పెరగడంతో సిమెంట్ డిమాండ్ అధికమవుతుందని వెల్లడించింది. మొత్తం డిమాండ్‌లో 12 రాష్ట్రాల వాటా 63-65 శాతం ఉండొచ్చని వివరించింది. దీనివల్ల సిమెంట్ ధరలు 2-4% పెరగొచ్చని పేర్కొంది.