News February 15, 2025

పెద్దపల్లిలో 16న ఇంటర్ స్టేట్ కరాటే పోటీలు

image

పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఈ నెల 16వ తేదీన 4వ ఇంటర్ స్టేట్ కరాటే ఛాంపియన్షిప్ పోటీలు జరగనున్నాయి. ఈ సందర్భంగా పోటీల అధికారిక పోస్టర్‌ను ACP కృష్ణ శుక్రవారం ఆవిష్కరించారు. ఈ పోటీలు వివిధ రాష్ట్రాల క్రీడాకారుల మధ్య ఉత్సాహంగా కొనసాగనున్నాయని తెలిపారు. కరాటే స్పోర్ట్స్ ప్రోత్సాహాన్ని పెంచేందుకు ఇటువంటి పోటీలు ఎంతో దోహదపడతాయని ACP పేర్కొన్నారు.

Similar News

News April 17, 2026

భవన నిర్మాణ కార్మికులకు ప్రభుత్వం అండ: కలెక్టర్

image

భవన నిర్మాణ రంగంలో పని చేస్తున్న కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం పలు పథకాలను అమలు చేస్తోందని కలెక్టర్ మహేశ్ కుమార్ శుక్రవారం తెలిపారు. జిల్లాలోని కార్మికులందరూ తప్పనిసరిగా తమ పేర్లను నమోదు చేసుకుని, ఈ ఆర్థిక ప్రయోజనాలను పొందాలని కోరారు. పథకాలు, అందుబాటులో ఉన్న ఆర్థిక సాయాన్ని తెలుపుతూ భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డులో నమోదైన కార్మికులకు పలు ఆర్థిక ప్రయోజనాలు కల్పించడం జరుగుతుందన్నారు.

News April 17, 2026

ఈనెల 21న అమలాపురంలో జాబ్ మేళా

image

ఈ నెల 21వ తేదీ ఉదయం 10:30 గంటలకు అమలాపురంలోని అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఉపాధి కార్యాలయం వద్ద జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి జి. శ్రీనివాసరావు శుక్రవారం తెలిపారు. ప్రముఖ సంస్థల్లో వివిధ ఉద్యోగాలకు SSC, ఇంటర్, ఏదైనా డిగ్రీ, ఐటిఐ, డిప్లమా ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులని తెలిపారు. దీనిపై మరిన్ని వివరాలకు 8978905032ను సంప్రదించాలన్నారు.

News April 17, 2026

జగన్ విదేశాలకు వెళ్లేందుకు కోర్టు అనుమతి

image

YCP చీఫ్ జగన్ విదేశాలకు వెళ్లేందుకు CBI కోర్టు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. ఈ నెల 20 నుంచి మే 15వ తేదీ మధ్య 2 వారాలు యూరప్, యూకే వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని జగన్ కోర్టును కోరారు. సానుకూలంగా స్పందించిన కోర్టు రూ.లక్ష పూచీకత్తు సమర్పించాలని ఆదేశించింది. అలాగే విదేశాల నుంచి వచ్చాక వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టుకు హాజరు కావాలంది. పర్యటన వివరాలు కోర్టు, CBIకి ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.