News February 11, 2025
పెద్దపల్లి: అతి తక్కువ ధరకు మట్టి, మొరం: కలెక్టర్

జిల్లాలో ప్రజలకు సొంత అవసరాల కోసం అవసరమైన మట్టి, మొరం తీసుకునేందుకు తహశీల్దారుల ద్వారా అతి తక్కువ ధరకు అనుమతి మంజూరు అవుతుందని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు. మట్టి, మోరం సరఫరాకు తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా స్థాయి సాండ్ కమిటీ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకున్నామన్నారు. ఒక ట్రాక్టర్‌కు రూ.200, టిప్పర్‌కు రూ.800 రుసుము తహశీల్దార్లకు చెల్లించి అనుమతి పొందాలన్నారు.
Similar News
News March 12, 2025
రేపు కలెక్టర్ అనంత మిత్ర లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమం

అనంతపురం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు అనంత మిత్ర లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా చేపట్టారు. రేపు అనంత రేడియో స్టేషన్ నుంచి ఉదయం 7.45 నుంచి 8.15 గంటల వరకు సర్వీస్ ఆఫ్ ట్రాన్స్ పోర్ట్ డిపార్ట్మెంట్ అనే అంశంపై ప్రజలతో సమస్యలు తెలుసుకోనున్నారు. 08554-225533 నంబర్‌కు ఫోన్ చేసి మాట్లాడవచ్చన్నారు.
News March 12, 2025
ఎన్నికల ప్రక్రియ బలోపేతానికి సలహాలివ్వండి: కలెక్టర్

భారత రాజ్యాంగ చట్టాలకు అనుగుణంగా ఎన్నికల ప్రక్రియను మరింత బలోపేతం చేయడానికి పార్టీ అధ్యక్షులు, సీనియర్ నాయకులందరిని సలహాలు, సూచనలు ఇవ్వాలని కలెక్టర్ విజయ్ కృష్ణన్ కోరారు. బుధవారం జిల్లా కలెక్టరేట్‌లో ఆమె మాట్లాడుతూ.. భారత ఎన్నికల సంఘం ఈ మేరకు రాజకీయ పార్టీలకు లేఖ రాసినట్లు ఆమె తెలిపారు. ఏప్రిల్ 30 లోపు సలహాలు, సూచనలు అందించాలని ఆమె కోరారు.
News March 12, 2025
ఒంగోలు: అధికారులకు దిశా నిర్దేశం చేసిన కలెక్టర్

నిషేధిత భూముల జాబితా నుంచి తొలగించిన భూముల పున: పరిశీలన ప్రక్రియ ఎలాంటి తప్పులు లేకుండా నిర్దేశించిన గడువులోగా పూర్తి చేసేలా రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా పేర్కొన్నారు. బుధవారం జిల్లాలో జరుగుతున్న నిషేధిత భూముల జాబితా నుంచి తొలగించిన భూముల పున: పరిశీలన ప్రక్రియ పురోగతిపై మండలాల రెవెన్యూ అధికారులతో సమీక్షించి, వారికి దిశానిర్దేశం చేశారు.