News February 16, 2025
పెద్దపల్లి: అధికారులకు అదనపు కలెక్టర్ కీలక ఆదేశాలు

అటవీ శాఖ పరిధి భూములు పరిశీలించి గంజాయి సాగు కనిపిస్తే వెంటనే పోలీస్ అధికారులకు సమాచారం అందించాలని కలెక్టరేట్ల అదనపు కలెక్టర్ వేణు అన్నారు. జిల్లాలో ఆసుపత్రులు, మెడికల్ షాపులలో స్టాక్ వివరాలను ప్రతి నెల తనిఖీ చేయాలని డ్రగ్ ఇన్స్పెక్టర్కు సూచించారు. చెడు అలవాట్లతో ఆరోగ్యం దెబ్బ తింటుందని, ఆలోచనా విధానం, ఆలోచనా శక్తి నశిస్తాయన్నారు. భావితరాలు మాదక ద్రవ్యాలకు ఆకర్షితులు కాకుండా చూడాలన్నారు.
Similar News
News November 2, 2025
వినుకొండ: రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

వినుకొండ పట్టణ సమీపంలో ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. స్థానికుల వివరాల ప్రకారం.. పట్టణ సమీపంలోని పసుపులేరు బ్రిడ్జి వద్ద ఆగి ఉన్న లారీని ద్విచక్ర వాహనం బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్పై ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు ఎవరనేది ఇంకా తెలియాల్సి ఉంది. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
News November 2, 2025
NOV.4న తిరుపతి జిల్లా కబడ్డీ జట్ల సెలక్షన్ ట్రయల్స్

37వ ఆంధ్రప్రదేశ్ సబ్ జూనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ కబడ్డీ ఛాంపియన్షిప్లో పాల్గొనే తిరుపతి జిల్లా బాలురు, బాలికల జట్ల ఎంపిక కోసం ట్రయల్స్ నవంబర్ 4న మధ్యాహ్నం 2 గంటలకు నాగలాపురం పాఠశాల మైదానంలో జరగనున్నాయి. బాలురు 60 కిలోల లోపు, బాలికలు 55 కిలోల లోపు బరువుతో, 2009 డిసెంబర్ 1 లేదా ఆ తరువాత జన్మించిన వారు మాత్రమే అర్హులు. ఆధార్ కార్డు తప్పనిసరిగా తీసుకురావాలని జిల్లా కబడ్డీ సంఘం తెలిపింది.
News November 2, 2025
గద్వాలలో అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి

గద్వాల్ పట్టణం శేరెల్లి వీధికి చెందిన బలిజ లక్ష్మి అనే మహిళా అనుమానాస్పదంగా మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. గద్వాల సీఐ శ్రీను, టౌన్ ఎస్ఐ కళ్యాణ్ కుమార్, రూరల్ ఎస్ఐ శ్రీకాంత్ సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. బలిజ లక్ష్మి, మల్లికార్జున్ ఇద్దరు భార్యాభర్తలు. భర్త ఫర్టిలైజర్ దుకాణం నిర్వహిస్తున్నాడు. కాగా మృతురాలి మెడలోని నాలుగు తులాల బంగారు గొలుసు కనిపించకపోవడం అనుమానాలకు తావిస్తోంది.


