News April 3, 2025
పెద్దపల్లి: అనుమానాస్పద స్థితిలో ఆర్టిజన్ ఉద్యోగి మృతి

పెద్దపల్లి జిల్లా కేంద్రంలో రైల్వే స్టేషన్ ప్రాంతంలోని ఒక అద్దె ఇంట్లో విద్యుత్ ఆర్టిజన్ ఉద్యోగి ఒడ్డబోయిన రాజుకుమార్ గురువారం తెల్లవారు జామున అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతుడు మంథని డివిజన్ కమ్మంపల్లి విద్యుత్ సబ్ స్టేషన్లో ఆర్టిజన్ ఉద్యోగిగా పని చేస్తుంటాడు, పెద్దపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News November 22, 2025
మానిటైజేషన్‌లో SEC, చెన్నై సహా 100 స్టేషన్లు

రైల్వే ఆస్తుల మానిటైజేషన్‌లో భాగంగా సికింద్రాబాద్, చెన్నై, ముంబై, ఢిల్లీ సహ 100 ప్రధాన స్టేషన్ల పరిధిలోని భూమి, కమర్షియల్ స్పేస్‌ను కేంద్రం లీజుకు ఇస్తుంది. ప్రయివేటు పెట్టుబడులతో సరకు రవాణా రైళ్లను ప్రవేశపెడుతుంది. మానిటైజేషన్ 1.0లో ₹1.5 లక్షల CR వస్తుందని అంచనా వేయగా కేవలం ₹28,717 CR సాధించింది. దీంతో 2.0లో భూమి, కమర్షియల్ స్పేస్‌పై రైల్వే దృష్టి సారించింది. 5 ఏళ్లలో దీన్ని పూర్తి చేయనుంది.
News November 22, 2025
గంగాధర డిగ్రీ కళాశాల భవన నిర్మాణానికి రూ. 5 కోట్లు మంజూరు

గంగాధర మండలంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవన నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం శనివారం రూ.5 కోట్లను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చొరవతోనే డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయించి, భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయించడంలో కృషి చేశారని పలువురు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యానికి మండల ప్రజలు, నాయకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.