News January 26, 2025
పెద్దపల్లి: అభయహస్తం ఆరు గ్యారంటీ పథకాల అమలు వివరాలు

పెద్దపల్లి జిల్లాలో అభయహస్తం ఆరు గ్యారంటీ పథకాల అమలు వివరాలను కలెక్టర్ కోయ శ్రీహర్ష వివరించారు. జిల్లాలో ఇప్పటివరకు మహాలక్ష్మి పథకం కింద 2 కోట్ల 40 లక్షల జీరో టికెట్లను మహిళలకు ఆర్టీసీ బస్సులు జారీ చేసింది. 500 రూపాయల గ్యాస్ సిలిండర్ సరఫరా పథకం కింద 1,16,807 కుటుంబాలకు 3,80,718 గ్యాస్ సిలిండర్లలకు రూ11.29కోట్ల సబ్సిడీ, గృహజ్యోతి పథకం కింద రూ.54.33 కోట్లను అందించిందన్నారు.
Similar News
News February 10, 2025
కేసముద్రంలో నాలుగు కిలోల గంజాయి పట్టివేత

మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో 4కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. సీఐ సర్వయ్య తెలిపిన వివరాలిలా.. నమ్మదగిన సమాచారం మేరకు 3 వ్యక్తులు అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్నారని తెలిసింది. దీంతో ఎస్సై మురళీధర్ తన సిబ్బందితో కలిసి తనిఖీలు చేపట్టారు. ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. వారి వద్ద తనిఖీ చేయగా 4కిలోల గంజాయి దొరికిందని సీఐ తెలిపారు.
News February 10, 2025
వైసీపీ ముఖ్య నేతలతో గుడివాడ సమావేశం

విశాఖ వైసీపీ ఆఫీసులో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ ఆధ్వర్యంలో సోమవారం ముఖ్య నేతల సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా విశాఖ జిల్లాలో ఇటీవల నియమించిన అనుబంధ సంఘాల అధ్యక్షులతో పలు విషయాలపై చర్చించారు. పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్, ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కెకె రాజు, రమణికుమారి ఉన్నారు.
News February 10, 2025
జోగులాంబ: ఐదుగురు డ్రైవర్ల పై కేసులు నమోదు

డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపితే చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ ఎస్ఐ బాలచంద్రుడు అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలో వాహనాల తనిఖీల్లో భాగంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ అనుమతితో ఇసుకను తరలిస్తున్న డ్రైవర్లు తప్పనిసరిగా లైసెన్స్ కలిగి ఉండాలన్నారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపిన 5 మంది డ్రైవర్లపై కేసులు నమోదు చేసినట్లు వివరించారు.