News March 22, 2025
పెద్దపల్లి: ఆన్లైన్ బెట్టింగ్ యాప్లకు యువకుడు బలి(అప్డేట్)

ఆన్లైన్ బెట్టింగ్ యాప్లకు మరో యువకుడు బలయ్యాడు. పెద్దపల్లి(D) మంథని(M) విలోచవరానికు చెందిన కొరవేన సాయితేజ(26) పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకుని KNRలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడని కుటుంబసభ్యులు తెలిపారు. ఆన్ లైన్ బెట్టింగ్ యాప్లో దశలవారీగా రూ.10లక్షలు పోగొట్టుకున్నాడని, అప్పులు తీర్చే దారిలేక ఈ నెల 18న ఆత్మహత్యాయత్నం చేయగా చికిత్స పొందుతూ గురువారం మృతిచెందాడని పేర్కొన్నారు.
Similar News
News November 19, 2025
9.2 కేజీల బంగారు సత్యసాయి విగ్రహం ఊరేగింపు

AP: పుట్టపర్తిలో సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలు నిన్న అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. 9.2 కేజీల బంగారంతో తయారు చేసిన సత్యసాయి విగ్రహాన్ని వెండి రథంలో పట్టణంలో ఊరేగించారు. భక్తజన సంద్రమైన ప్రశాంతి నిలయంలో ‘సురంజలి’ పేరుతో సంగీత కార్యక్రమం జరిగింది. నేడు ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్, సచిన్ టెండూల్కర్, ఐశ్వర్యరాయ్ తదితర ప్రముఖులు జయంతి ఉత్సవాల్లో పాల్గొననున్నారు.
News November 19, 2025
తిరుపతి రైతులకు నేడు నగదు జమ

తిరుపతి జిల్లా రైతులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అన్నదాత సుఖీభవ పథకం రెండో విడత నగదు ఇవాళ విడుదల కానుంది. జిల్లాలోని 1,54, 908 మంది రైతులకు రూ.104 కోట్లు బుధవారం జమ చేయనున్నారు. కడప జిల్లా నుంచి సీఎం చంద్రబాబు నగదు విడుదల చేస్తారు. తిరుపతి జిల్లాలో ప్రస్తుతం వరినాట్లు మొదలయ్యాయి. వీరికి ఈ నగదు ఎంతగానో ఉపయోగపడనుంది.
News November 19, 2025
నిజామాబాద్: 23 మందికి రూ.2.36 లక్షల జరిమానా

నిజామాబాద్ డివిజన్ పరిధిలో మద్యం తాగి వాహనాలు నడిపిన 30 మందిని పోలీసులు పట్టుకున్నారు. వారిని మంగళవారం జిల్లా మార్నింగ్ కోర్టులో సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ నూర్జహాన్ ఎదుట హాజరుపరిచారు. వారిలో 23 మందికి రూ.2.36 లక్షల జరిమానా విధిస్తూ తీర్పు నిచ్చింది. మరో ఏడుగురికి జైలు శిక్ష పడింది. అంతకు ముందు వారికి సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులు కౌన్సెలింగ్ ఇచ్చారు.


