News March 11, 2025

పెద్దపల్లి: ఇంటర్మీడియట్ పరీక్షలకు నేడు 207 మంది గైర్హాజరు

image

పెద్దపల్లి జిల్లాలో మంగళవారం ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రశాంతంగా కొనసాగాయని జిల్లా ఇంటర్ నోడల్ అధికారి కల్పన తెలిపారు. గణితం, ఔషధశాస్రం, పొలిటికల్ సైన్స్ పేపర్లకు పరీక్షలు నిర్వహించామన్నారు. 5845 మంది విద్యార్థులకు గాను 5638 మంది విద్యార్థులు హాజరయ్యారని పేర్కొన్నారు. 207 మంది గైర్హాజరయ్యారని తెలిపారు. గైర్హాజరైన వారిలో జనరల్ 137, వొకేషనల్ 70మంది ఉన్నారని తెలిపారు.

Similar News

News October 30, 2025

ఏపీ న్యూస్ రౌండప్

image

* అమరావతి పరిధిలోని భూమిలేని నిరుపేదలకు పెన్షన్ల కోసం ప్రభుత్వం ₹71.09Cr విడుదల చేసింది.
* CRDA తీసుకున్న రుణాలపై వాయిదా చెల్లింపులకు ప్రభుత్వం ₹287Cr కేటాయించింది.
* అమరావతిలోని నెక్కల్లులో యువతకు నైపుణ్య శిక్షణకు L&T సంస్థ ₹369Crతో ఓ కేంద్రాన్ని నిర్మించనుంది. దీనికి సంస్థ ప్రతినిధులు భూమి పూజ నిర్వహించారు.
* అసంపూర్తిగా ఉన్న బీసీ హాస్టళ్లను పూర్తిచేసేందుకు ప్రభుత్వం ₹60Cr మంజూరు చేసింది.

News October 30, 2025

GNT: రంగస్థల కళాకారుడి నుంచి దర్శకుడు దాకా

image

ప్రముఖ రంగస్థల కళాకారుడు, నట శిక్షకుడు, తెలుగు సినిమా దర్శకులు బీరం మస్తాన్‌ రావు (అక్టోబర్ 30, 1944-జనవరి 28, 2014) గుంటూరులో జన్మించారు. అల్లు రామలింగయ్య, సుత్తి వీరభద్రరావు, జమున, గరికపాటి రాజారావు, తదితరులతో కలిసి నాటకాలలో నటించారు. బాలమిత్రుల కథ చిత్రంతో సహాయ దర్శకుడిగా సినిమా జీవితాన్ని ప్రారంభించారు. దర్శకుడిగా ఆయనకు తొలిచిత్రం కృష్ణ-శ్రీదేవి జంటగా నటించిన బుర్రిపాలెం బుల్లోడు.

News October 30, 2025

నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియంలో ఉద్యోగాలు

image

నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియం 7 క్యూరేటర్-B ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతోంది. ఎంఎస్సీ/బీఈ/బీటెక్/MS/ఎంటెక్/పీహెచ్‌డీ అర్హతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు నవంబర్ 7 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 35ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. రాత పరీక్ష లేదా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://ncsm.gov.in/