News February 1, 2025
పెద్దపల్లి: ఇంటర్ పరీక్షలపై సమీక్షించిన అదనపు కలెక్టర్

ఇంటర్ పరీక్షల నిర్వహణపై సంబంధిత అధికారులతో అదనపు కలెక్టర్ దాసరి వేణు ఈరోజు సమీక్షించారు. పకడ్బందీగా ఇంటర్ పరీక్షలను నిర్వహించాలని సూచించారు. మార్చి 5 నుంచి 25 వరకు ఇంటర్ పరీక్షల నిర్వహణ ఉందన్నారు. ఇంటర్ పరీక్షల కోసం 23పరీక్షా కేంద్రాల ఏర్పాటు చేశామన్నారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద పారా మెడికల్ సిబ్బంది అందుబాటులో ఉండాలన్నారు. సమయానుకూలంగా ఆర్టీసీ బస్సులు నడపాలని ఆర్టీసీ డిపో మేనేజర్కు సూచించారు.
Similar News
News November 20, 2025
సంగారెడ్డి: మంత్రిని కలిసిన ల్యాబ్ టెక్నీషియన్లు

ఇటీవల విడుదల చేసిన ఫలితాల్లో జిల్లా నుంచి ఎంపికైన ల్యాబ్ టెక్నీషియన్లు మంత్రి దామోదర రాజనరసింహను గురువారం సంగారెడ్డిలో కలిశారు. మంత్రి వారిని అభినందించి, జిల్లా వైద్య సిబ్బంది బలోపేతం కోసం సర్కార్ ఎల్లప్పుడూ కృషి చేస్తుందని అన్నారు. ఈ సందర్భంలో ఎంపికైన వారిలో శ్రీశరత్ కుమార్, రాజు, ఇతర సంగారెడ్డి జిల్లా ల్యాబ్ టెక్నిషియన్లు పాల్గొన్నారు.
News November 20, 2025
ఖాళీల భర్తీకి చర్యలు తీసుకోవాలి: ఎమ్మెల్యే తెల్లం

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి అధికారులు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు వివరించాలని భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు అన్నారు. ములుగు కలెక్టరేట్లో నిర్వహించిన దిశా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలు, పనులను త్వరితగతిన ప్రారంభించాలన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లోని పలు శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయడానికి చర్యలు తీసుకోవాలని కోరారు.
News November 20, 2025
నౌపడలో గుర్తు తెలియని మహిళ మృతదేహం

సంతబొమ్మాళి మండలం నౌపడ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక పొలంలో గురువారం గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సబ్ ఇన్స్పెక్టర్ నారాయణస్వామి మృతదేహాన్ని పరిశీలించిన అనంతరం, మృతురాలి వివరాలు ఎవరికైనా తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


