News April 22, 2025

పెద్దపల్లి: ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో 62.09 శాతం

image

ఇంటర్ ఫలితాల్లో పెద్దపల్లి జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. ఫస్ట్ ఇయర్‌లో 4,896 మందికి 3,040 మంది పాసయ్యారు. 62.09 శాతం పాస్ పర్సంటేజీ వచ్చింది. సెకండ్ ఇయర్‌లో 4,715 మంది పరీక్షలు రాయగా 3,359 మంది పాసయ్యారు. 71.24 శాతం పాస్ పర్సంటేజీ వచ్చింది.

Similar News

News April 24, 2025

ప.గో జిల్లా టాపర్ ఈ బాలికే..!

image

నరసాపురం మండలంలోని లక్ష్మణేశ్వరం మహాత్మా జ్యోతీ బా పూలే గురుకుల పాఠశాల (బాలికలు)విద్యార్థులు పదో తరగతి ఫలితాలలో ప్రతిభ చూపారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని రావి అశ్విని 592 మార్కులు సాధించి జిల్లాస్థాయిలో సాధించి ప్రథమ స్థానంలో నిలిచినట్లు ప్రిన్సిపల్ సీహెచ్ కె. శైలజ తెలిపారు. పెరవలి గ్రామానికి చెందిన అశ్విని తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలుగా పని చేస్తూ ఉంటారు.

News April 24, 2025

కర్నూలు జిల్లా టాపర్లు వీరే!

image

కర్నూలు జిల్లా విద్యార్థులు పదో తరగతి ఫలితాల్లో అదరగొట్టారు. జిల్లాలోని వివిధ పాఠశాలలకు చెందిన ఏడుగురు 597 మార్కులు సాధించి జిల్లా టాపర్లుగా నిలిచారు. కర్నూలుకు చెందిన టి.గాయత్రి, గీతిక, కీర్తన, ఎమ్మిగనూరుకు చెందిన మహ్మద్, ఆదోనికి చెందిన సలీమా, జి.నందు, హరిణి టాపర్ల జాబితాలో ఉన్నారు. ఇక జిల్లాలో మొత్తం 31,185 మంది పరీక్ష రాయగా 20,584 మంది పాసయ్యారు. 

News April 24, 2025

భగ్గుమంటున్న పాలమూరు.. జరభద్రం !

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలో రోజురోజుకు ఎండలు భగ్గుమంటున్నాయి. తొలిసారి ఏప్రిల్ నెలలోనే అత్యధికంగా 43 డిగ్రీలపైగా ఉష్ణోగ్రత నమోదైంది. నిన్న వనపర్తి, గద్వాల జిల్లాల్లో 43 డిగ్రీలు, నారాయణంపేటలో 42.4, నాగర్ కర్నూల్ 42.1, మహబూబ్‌నగర్‌లో 42 డిగ్రీలు నమోదైంది. ముందు ముందు ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. అత్యవసరమైతేనే బయటకు రావాలని, జాగ్రత్తలు పాటించాలని పేర్కొంది.

error: Content is protected !!