News June 13, 2024

పెద్దపల్లి: ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

image

పెద్దపల్లి పట్టణంలోని కూనారం రోడ్డులో విద్యార్థిని(17) ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికుల వివరాల ప్రకారం.. హనుమకొండ జిల్లా హసన్‌పర్తికి చెందిన యువతి వారం రోజుల కిందట పెద్దపల్లిలోని బంధువుల ఇంటికి వచ్చింది. బుధవారం ఇంట్లో ఉరేసుకుంది. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతికి గల కారణాలు తెలియరాలేదని విచారణ అనంతరం తెలుపుతామని ఎస్ఐ లక్ష్మణ్ తెలిపారు

Similar News

News February 24, 2026

KNR: డిజిటల్ జూదం.. పోలీసులకు సవాల్‌!

image

కరీంనగర్ జిల్లాలో పేకాటరాయుళ్లు పంథా మార్చారు. పోలీసులకు చిక్కకుండా ఫోన్ పే, గూగుల్ పే వంటి యాప్‌ల ద్వారా నగదు బదిలీ చేస్తూ జూదం ఆడుతున్నారు. శివారు ప్రాంతాల్లోని తోటలు, కోళ్ల ఫారాలను అడ్డాలుగా మార్చుకొని.. బయట కాపలాదారులు, సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. గత మూడేళ్లలో 1,433 మందిని పోలీసులు పట్టుకున్నా.. తాజా సాంకేతిక పోకడలు, పక్కా నిఘా వ్యవస్థ వారికి సవాలుగా మారాయి.

News February 24, 2026

చార్మినార్ భాగ్యలక్ష్మి గుడికి కరీంనగర్ కార్పొరేటర్లు, కౌన్సిలర్లు

image

కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఎన్నికైన కార్పొరేటర్లు, కౌన్సిలర్లు నేడు పాతబస్తీలోని భాగ్యలక్ష్మీ ఆలయాన్ని దర్శించుకోనున్నారు. ఉదయం నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సమావేశమైన అనంతరం, కేంద్ర మంత్రి బండి సంజయ్, రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావులతో కలిసి ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం లాల్ దర్వాజ మహంకాళి ఆలయాన్ని సందర్శించి, స్థానిక నాయకులతో భోజన కార్యక్రమంలో పాల్గొంటారు.

News February 24, 2026

KNR: ఆన్‌లైన్ హాల్ టికెట్‌తో అనుమతి

image

ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్నాయి. జిల్లాలో 36,426 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. 57 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు జరుగుతాయి. ప్రిన్సిపల్ సంతకం లేకపోయినా ఆన్‌లైన్ హాల్ టికెట్‌తోనే పరీక్షలకు హాజరుకావచ్చని RIEO గంగాధర్ స్పష్టం చేశారు.