News February 21, 2025

పెద్దపల్లి: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల కోసం వెబ్‌సైట్!

image

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల కోసం రాష్ట్ర ప్రభుత్వం వెబ్ సైట్ తీసుకువచ్చింది. పెద్దపల్లి జిల్లాలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని పేదలు ఇల్లు కోసం దరఖాస్తు చేసుకోగా.. లబ్ధిదారులను అధికారులు ఎంపిక చేశారు. ప్రస్తుతం దరఖాస్తు ఏ స్థితిలో ఉందో తెలియక ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. అయితే వారంతా https:indirammaindlu.telangana.gov.inలో ఆధార్, ఫోన్ నంబర్ ద్వారా దరఖాస్తు వివరాలు తెలుసుకోవచ్చు. Share It.

Similar News

News October 16, 2025

సిరిసిల్ల: ‘కొనుగోలు కేంద్రాల్లో విక్రయించాలి’

image

రైతులు తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో విక్రయించాలని అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ అన్నారు. సిరిసిల్ల పరిధిలోని పెద్దూరు, పెద్దబోనాల, సర్దాపూర్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను గురువారం ఆయన ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. మెప్మా ఆధ్వర్యంలో 231 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. 17% శాతం తేమ ఉండేలా చూసుకుని కేంద్రాలకు ధాన్యాన్ని తరలించాలన్నారు. ఏఎంసీ చైర్ పర్సన్ స్వరూప ఉన్నారు.

News October 16, 2025

‘ఎల్లమ్మ’ సినిమాలో హీరోగా దేవిశ్రీప్రసాద్?

image

‘బలగం’తో డైరెక్టర్‌గా మారిన కమెడియన్ వేణు ‘ఎల్లమ్మ’ పేరుతో ఓ మూవీ తీయబోతున్న సంగతి తెలిసిందే. ఇందులో హీరోగా మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ నటించనున్నట్లు తాజాగా ఓ వార్త బయటకొచ్చింది. దీనిపై మూవీ టీమ్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. అంతకుముందు ఈ ప్రాజెక్టు నాని నుంచి నితిన్‌కు, తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ వద్దకు వెళ్లినట్లు ప్రచారం జరిగింది. ఇప్పుడు DSP పేరు వినిపించడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు.

News October 16, 2025

సిద్దిపేట: ఓటర్ ఐడీలను పంపిణీ చేయాలి: కలెక్టర్

image

ఓటర్ ఐడీలను పంపిణీ చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సుదర్శన్ రెడ్డి జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు. గురువారం హైదరాబాద్ ఎన్నికల సంఘం కార్యాలయం నుంచి జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పెండింగ్‌లో ఉన్న ఫామ్ 6,7,8 దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని, బీఎల్ఓ‌లకు గుర్తింపు కార్డుల పంపిణీ, నూతన ఓటర్లకు ఎపిక్ కార్డ్ పంపిణీ చేయాలన్నారు. జిల్లా కలెక్టర్ హైమావతి పాల్గొన్నారు.