News February 22, 2025
పెద్దపల్లి: ఇటుక బట్టీలకు ఉచితంగా ఎన్టీపీసీ యాష్

పెద్దపల్లి జిల్లాలో ఇటుక బట్టీలకు ఎన్టీపీసీ యాజమాన్యం యాష్ ఉచితంగానే అందిస్తోందని పెద్దపల్లి ప్రాంత ఇటుక బట్టీల యాజమాన్య సంక్షేమ సంఘం నాయకులు తెలిపారు. జిల్లా కేంద్రంలో శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎంఎస్ఎం ద్వారా 114 యూనిట్ల యాష్ ఉచితంగా ఇటుకబట్టీలకు ఇచ్చేందుకు ఎన్టీపీసీ యాజమాన్యం అంగీకరించడంతో యాష్ వాడుతున్నామని పేర్కొన్నారు.
Similar News
News December 4, 2025
ఖమ్మం: గుర్తులొచ్చాయ్.. ఉదయం 6 నుంచే షురూ

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పంచాయతీ ఎన్నికల సమరం జోరందుకుంది. తొలి, రెండో విడత నామినేషన్ల పర్వం ముగియడంతో అభ్యర్థులు తమ ప్రచారాన్ని ఉదయం 6 గంటలకే మొదలుపెడుతున్నారు. తొలి విడత పోలింగ్ ఈ నెల 11వ తేదీ ఉదయం 7 గంటలకు ప్రారంభం కానుంది. పోలింగ్కు వారం రోజులే సమయం ఉండడం, బుధవారం గుర్తులు కేటాయించడంతో అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకుంటూ, తమ ప్రచారాన్ని స్పీడప్ చేస్తున్నారు.
News December 4, 2025
2వ విడత ఎన్నికలకు పది రోజులే..!

హనుమకొండ జిల్లాలోని 5 మండలాల్లో రెండో విడత ఎన్నికల పోలింగ్కు పది రోజుల గడువు మాత్రమే ఉంది. 14వ తేదీ ఆదివారం ఎన్నికల పోలింగ్, కౌంటింగ్ జరగనుంది. ఇప్పటికే ఆయా గ్రామాల్లో సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థులు నిత్యం ప్రజల్లో ఉంటూ వారి మద్దతును కూడగడుతున్నారు. జిల్లాలోని హసన్పర్తి, ఐనవోలు, ధర్మసాగర్, వేలేరు, పరకాల మండలాల్లో రెండవ విడత పోలింగ్ జరగనుంది.
News December 4, 2025
బాలికను వేధించిన కేసులో మూడేళ్ల జైలు, జరిమానా

HNK: బాలికను వేధించిన కేసులో నిందితుడైన లకావత్ వీరుకు హనుమకొండ అదనపు జిల్లా కోర్టు జడ్జి బి.అపర్ణాదేవి తీర్పు వెలువరించారు. నిందితుడికి 3 ఏళ్ల జైలు శిక్షతో పాటు ₹21 వేల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. బాలిక ఇంటర్ చదువుతున్న సమయంలో సెల్ఫోన్లో ఫొటోలు తీసి, వాటితో భయపెట్టి ఒత్తిడి చేసిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరపగా, దీనిపై నేడు తీర్పు వచ్చింది.


