News February 11, 2025
పెద్దపల్లి: ఇద్దరు మేకల దొంగల అరెస్ట్

కాల్వశ్రీరాంపూర్, మల్యాలలో మేకలు దొంగతనం చేసిన చొప్పదండికి చెందిన మనుపతి సంజీవ్‌కుమార్, కమాన్‌పూర్ మండలం పెంచకల్‌పేటకు చెందిన శివరాత్రి రమేశ్‌లను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు ఎస్ఐ వెంకటేశ్ తెలిపారు. వీరు జల్సాలకు అలవాటుపడి దొంగతనాలకు చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ నెల 2న కాల్వశ్రీరాంపూర్‌కు చెందిన టీ.కొమురయ్య 3, మల్యాలకు చెందిన బీ.రాజయ్య 2 మేకలను దొంగతనం చేశారని ఎస్ఐ తెలిపారు.
Similar News
News December 2, 2025
DEC 9 అర్ధరాత్రి నుంచి రవాణా వాహనాల బంద్

రవాణా వాహనాలకు కేంద్రం ఫిట్నెస్ <<18321648>>ఛార్జీలు<<>> పెంచడంపై సౌత్ ఇండియా మోటార్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్(SIMTA) కీలక నిర్ణయం తీసుకుంది. DEC 9 అర్ధరాత్రి నుంచి రవాణా వాహనాల బంద్ పాటించనున్నట్లు ప్రకటించింది. AP, TN, TG, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరికి చెందిన 12 ఏళ్లు పైబడిన వాహన యజమానులు ఇందులో పాల్గొంటారని పేర్కొంది. కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేవరకు బంద్ కొనసాగుతుందని తెలిపింది.
News December 2, 2025
ఉస్మానియా పార్కులో రాజాపూర్ విద్యార్థి ఆత్మహత్య

శంకరపట్నం మండలం రాజాపూర్ గ్రామానికి చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి రెడ్డి విజ్ఞాన్ తేజ (19) ఉస్మానియా యూనివర్సిటీలో ఆత్మహత్య చేసుకున్నాడు. మైనింగ్ విభాగంలో రెండో సంవత్సరం చదువుతున్న విజ్ఞాన్ తేజ, సోమవారం రాత్రి ఉస్మానియా ఆక్సిజన్ పార్కులో ఓ చెట్టుకు ఉరి వేసుకుని మృతి చెందినట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, గ్రామస్థులు హుటాహుటిన హైదరాబాద్‌కు బయలుదేరినట్లు గ్రామస్థులు తెలిపారు.
News December 2, 2025
రేపు ప్రధాని మోదీతో సీఎం రేవంత్ భేటీ

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు. రేపు ఉదయం 11 గంటలకు ఆయన ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. పార్లమెంట్ భవనంలోనే పీఎంతో సమావేశమై తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు ఆహ్వానించనున్నారు. అలాగే పలువురు కేంద్రమంత్రులను సైతం రేవంత్ కలిసి సదస్సుకు ఇన్వైట్ చేయనున్నారు.


