News February 11, 2025

పెద్దపల్లి: ఇద్దరు మేకల దొంగల అరెస్ట్

image

కాల్వశ్రీరాంపూర్, మల్యాలలో మేకలు దొంగతనం చేసిన చొప్పదండికి చెందిన మనుపతి సంజీవ్‌కుమార్‌, కమాన్‌పూర్ మండలం పెంచకల్‌పేటకు చెందిన శివరాత్రి రమేశ్‌లను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు ఎస్‌ఐ వెంకటేశ్ తెలిపారు. వీరు జల్సాలకు అలవాటుపడి దొంగతనాలకు చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ నెల 2న కాల్వశ్రీరాంపూర్‌కు చెందిన టీ.కొమురయ్య 3, మల్యాలకు చెందిన బీ.రాజయ్య 2 మేకలను దొంగతనం చేశారని ఎస్‌ఐ తెలిపారు.

Similar News

News March 23, 2025

అట్లీ సినిమాలో బన్నీ డ్యుయల్ రోల్?

image

తమిళ డైరెక్టర్ అట్లీతో చేయబోయే సినిమాలో అల్లు అర్జున్ ద్విపాత్రాభినయం చేయనున్నట్లు వార్తలొస్తున్నాయి. ఒక క్యారెక్టర్‌లో నెగటివ్ షేడ్స్ ఉంటాయని, సినిమాలో మెయిన్ విలన్ పాత్ర అదేనని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. దీనిపై మూవీ టీమ్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా ‘పుష్ప’ సినిమాలోని పుష్పరాజ్ పాత్రలోనూ కొంతవరకు నెగటివ్ షేడ్స్ ఉన్న సంగతి తెలిసిందే.

News March 23, 2025

NRPT: జిల్లా క్రీడాకారునికి బ్రాంజ్ మెడల్

image

నారాయణపేట జిల్లా దామరగిద్ద చెందిన కనకప్ప పారా అథ్లెటిక్స్ లో బ్రాంజ్ మెడల్ సాధించినట్లు అథ్లెటిక్స్ జిల్లా ప్రధాన కార్యదర్శి రమణ తెలిపారు. ఖేలో ఇండియా పారా అథ్లెటిక్స్ లో లాంగ్ జంప్ విభాగం నందు పాల్గొన్న కనకప్ప 5.30 మీటర్స్ దూకి, ఉత్తమ ప్రతిభ కనబరిచినట్లు రమణ వివరించారు. నారాయణపేట జిల్లాకు చెందిన అభ్యర్థి పతకం సాధించడం పట్ల అథ్లెటిక్స్ అసోసియేషన్ సభ్యులు,పీడీలు, పీఈటీలు హర్షం వ్యక్తం చేశారు.

News March 23, 2025

విదేశీ విద్య కోసం ఉపకార వేతనాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

విదేశాల్లో చదువుకునేందుకు ఉపకార వేతనాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు ఎస్సీ సంక్షేమ అధికారి సుదర్శన్ ఒక ప్రకటన ద్వారా వెల్లడించారు. 2024 25 విద్యా సంవత్సరానికి డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యా నిధి పథకం ద్వారా 19.05.2025 లోపు telanganaepass.cgg.gov.in వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇతర వివరాలకు 08542-220020 నెంబర్ పై సంప్రదించాలన్నారు. SHARE IT.

error: Content is protected !!