News March 9, 2025

పెద్దపల్లి: ఇన్‌స్పైర్ అవార్డుకు ఎంపికైన విద్యార్థిని

image

పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న అమీమ తహరీం ఇన్‌స్పైర్ అవార్డుకు ఎంపికైంది. ఈ సందర్భంగా జిల్లా సైన్స్ అధికారి రఘునందన్ రావు ఆ చిన్నారిని అభినందించారు. విద్యార్థిని ప్రతిభను గుర్తించి అవార్డుకు ఎంపిక చేయడం గర్వకారణమని పేర్కొన్నారు. విద్యార్థుల సృజనాత్మకతను ప్రోత్సహించే ఇలాంటి అవార్డులు మరింత ప్రేరణనిస్తాయని తెలిపారు.

Similar News

News March 17, 2026

సంగారెడ్డి: పిల్లలను ఈతకు పంపవద్దు: ఎస్పీ

image

ఒంటిపూట బడులు ప్రారంభమైన నేపథ్యంలో పిల్లలను ఈతకు పంపవద్దని ఎస్పీ పారితోష్ పంకజ్ సోమవారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. చెరువులు కుంటల వద్ద పిల్లలకు లోతు తెలియకపోవడంతో మునిగిపోయే ప్రమాదం ఉందని చెప్పారు. తల్లిదండ్రుల సంరక్షణలోనే పిల్లలకు ఈత నేర్పించాలని సూచించారు. పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని తెలిపారు.

News March 17, 2026

ఆసిఫాబాద్: ఉపాధి పథకాలకు దరఖాస్తుల ఆహ్వానం!

image

ఎస్సీ యువతీ యువకులకు 2025–26 వార్షిక ప్రణాళిక కింద స్వయం ఉపాధి పథకాల కోసం ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ హరిత తెలిపారు. ఎలక్ట్రిక్ వాహనాలు, సోలార్ పంప్ కంట్రోల్ వంటి పథకాలు అందుబాటులో ఉన్నాయని, యూనిట్ ఖర్చు రూ.3 లక్షల నుంచి రూ.7 లక్షల వరకు ఉంటుందని పేర్కొన్నారు. అర్హులు మార్చి 17 నుంచి 24 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఆమె సూచించారు.

News March 17, 2026

ఇళ్ల నిర్మాణాలను ఉగాది నాటికి పురోగతిలోకి తీసుకురావాలి: కలెక్టర్

image

బాపట్లలో సోమవారం నిర్వహించిన వీక్షణ సమావేశంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ ఎంజిఎన్ఆర్ఈజీఎస్, గృహ నిర్మాణ శాఖ పనుల పురోగతిని సమీక్షించారు. పనుల్లో వెనుకబడిన మండల అధికారులను ప్రశ్నిస్తూ, పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. పీఎంఏవై పథకంలోని ఇళ్ల నిర్మాణాలను ఉగాది నాటికి పురోగతిలోకి తీసుకురావాలని సూచించారు. పనులు ప్రారంభించని లబ్ధిదారులకు నోటీసులు జారీ చేయాలని తెలిపారు.