News February 28, 2025

పెద్దపల్లి: ఈ వ్యక్తి తెలిస్తే.. సమాచారం ఇవ్వండి: రైల్వే పోలీసులు

image

పెద్దపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి (40)కి నిన్న రాత్రి తీవ్ర గాయాలు అయినట్లు రామగుండం రైల్వే హెడ్ కానిస్టేబుల్ తిరుపతి తెలిపారు. బాధితుడిని అత్యవసర చికిత్స కోసం కరీంనగర్ తరలించినట్లు పేర్కొన్నారు. అతడి వద్ద ఎలాంటి గుర్తింపు కార్డులు లేవన్నారు. అతడిని గుర్తు పడితే 9949304574 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని ఆయన సూచించారు. 

Similar News

News December 9, 2025

జామపండు తింటే ఎన్నో లాభాలు!

image

మార్కెట్‌లో విరివిగా లభించే జామపండును పోషకాల పవర్ హౌస్ అని పిలుస్తారు. ఇది నారింజ కంటే 4 రెట్లు అధికంగా విటమిన్ C అందించి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇందులో ఉన్న పీచుపదార్థం చక్కెర స్థాయులను నియంత్రిస్తుంది. కేవలం 60-70క్యాలరీలు మాత్రమే ఉండటం వల్ల బరువు తగ్గడానికి తోడ్పడుతుంది. దేశీయ సూపర్ ఫ్రూట్ అయిన జామను రోజువారీ ఆహారంలో చేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. share it

News December 9, 2025

ఘోర అగ్నిప్రమాదం.. 20 మంది మృతి

image

ఇటీవల తుఫాన్ బీభత్సంతో అతలాకుతలమైన ఇండోనేషియాలో మరో ఘోర ప్రమాదం సంభవించింది. రాజధాని జకార్తాలో ఓ ఏడంతస్తుల భవనంలో అగ్నిప్రమాదం జరిగి 20 మంది మరణించారు. మరికొంత మంది గాయపడ్డారు. ఏరియల్ సర్వే కోసం ఉపయోగించే డ్రోన్ల తయారీ బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్‌లో మొదలైన మంటలు వెంటనే భవనమంతా వ్యాపించాయి. ఆ సమయంలో కొందరు ఉద్యోగులు భోజనం చేస్తున్నారు. మంటలు చుట్టుముట్టడంతో వారంతా సజీవదహనం అయ్యారు.

News December 9, 2025

చిత్తూరు నూతన DEOగా రాజేంద్ర ప్రసాద్

image

చిత్తూరు జిల్లా నూతన డీఈవోగా రాజేంద్ర ప్రసాద్‌ నియమితులయ్యారు. ఈ మేరకు విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన ప్రస్తుతం బుక్కపట్నం డైట్ కాలేజీ ప్రిన్సిప‌ల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. మరో వారంలో ఆయన డీఈవోగా బాధ్యతలు నిర్వహిస్తారని సమాచారం. ప్రస్తుత చిత్తూరు డీఈవో వరలక్ష్మిని కార్వేటినగరం డైట్ కాలేజీకి బదిలీ చేయనున్నారు.