News February 4, 2025

పెద్దపల్లి: ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

image

కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలకు చెందిన BC, SC, ST అభ్యర్థులు RRB, SSC, Banking ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి ఉచితంగా కోచింగ్ ఇవ్వనున్నట్లు KNR బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ డాక్టర్ రవి కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. అర్హులైన వారు ఫిబ్రవరి 9 వరకు www.tgbcstudycircle.cgg.gov.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.

Similar News

News February 14, 2025

TGSRTCకి రూ.21.72 కోట్ల టోకరా.. ‘గో రూరల్’ ఆస్తులు సీజ్

image

TGSRTC బస్సులపై ప్రకటనల పేరుతో గో రూరల్ ఇండియా రూ.21.72 కోట్ల మోసానికి పాల్పడింది. యాడ్స్ ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఆర్టీసీకి ఇవ్వకుండా తమ అనుబంధ కంపెనీలకు మళ్లించుకుని వ్యాపారం చేసినట్లు ఈడీ గుర్తించింది. దీంతో ఆ సంస్థకు చెందిన రూ.6.47 కోట్ల విలువైన స్థిరాస్తులను తాత్కాలికంగా జప్తు చేసింది. ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొంది.

News February 14, 2025

మున్షీ స్థానంలో మీనాక్షి

image

TG: ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జిగా దీపాదాస్ మున్షీ స్థానంలో మీనాక్షి నటరాజన్‌ను కాంగ్రెస్ అధిష్ఠానం నియమించింది. ఈ మేరకు ఏఐసీసీ కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈమె రాహుల్ గాంధీ టీమ్‌లో కీలకంగా ఉన్నారు. కొంతకాలంగా మున్షీ తీరుపై రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఫిర్యాదులు చేస్తున్నట్లు సమాచారం.

News February 14, 2025

పీఎంశ్రీ నిధుల వినియోగంపై సమీక్ష

image

జనగామ జిల్లా కలెక్టరేట్‌లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పీఎం శ్రీ సమగ్ర శిక్ష పథకాల అమలు తీరుపై హైదరాబాద్ నుంచి పాఠశాల విద్యా డైరెక్టర్ నర్సింహారెడ్డితో కలిసి రాష్ట్ర విద్యా శాఖ సెక్రెటరీ యోగిత రాణా కలెక్టర్లతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లాలో పీఎంశ్రీ కింద ఎంపిక చేయబడిన 15 పాఠశాలల్లో వివిధ అభివృద్ధి పనుల నిమిత్తం విడుదల చేయబడిన నిధులు, వాటి వినియోగంపై పలు సూచనలు చేశారు.

error: Content is protected !!