News February 1, 2025
పెద్దపల్లి: ఉరేసుకుని వృద్ధురాలి ఆత్మహత్య

పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం కిష్టంపేటలో ఓ వృద్ధురాలు ఆత్మహత్య చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన ఐరవేణి రామక్క (90) అనారోగ్య సమస్యలతో బాధపడుతూ, ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాత్రూంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెంకటేశ్ తెలిపారు. మృతురాలికి ముగ్గురు కొడుకులు ఉన్నారు.
Similar News
News November 20, 2025
హిడ్మా మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి

AP: అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో భద్రతా బలగాల ఎదురుకాల్పుల్లో మృతి చెందిన మావోయిస్టు హిడ్మా మృతదేహానికి పోస్టుమార్టం పూర్తైంది. మొత్తం ఆరుగురు మావోయిస్టులు మృతి చెందగా బుధవారం రాత్రి వరకు హిడ్మా, అతని భార్య రాజేతోపాటు మరో మావోయిస్టు మృతదేహానికి మాత్రమే రంపచోడవరం ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం జరిగింది. మరో ముగ్గురి మృతదేహాల కోసం కుటుంబ సభ్యులు వేచి చూస్తున్నారు.
News November 20, 2025
కర్నూలు జిల్లాలో 8,051 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు

రోడ్డు ప్రమాదాల నివారణకు డ్రంక్ అండ్ డ్రైవ్, ఓపెన్ డ్రింకింగ్ తనిఖీలు ముమ్మరం చేస్తున్నట్లు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. మద్యం తాగి వాహనం నడిపితే ఒక నెల జైలు శిక్షతో పాటు కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ ఏడాది జనవరి నుంచి ఈనెల 17వ తేదీ వరకు కర్నూలు జిల్లాలో 8,051 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు.
News November 20, 2025
శబరిమల భక్తులకు అలర్ట్!

భక్తులు భారీగా తరలివస్తున్న నేపథ్యంలో ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. స్పాట్ బుకింగ్స్ను 20 వేల నుంచి 5 వేలకు తగ్గించింది. వర్చువల్ క్యూ ద్వారా మరో 70 వేల మందిని అనుమతించనుంది. ఈ మేరకు రోజుకు 75 వేల మందికి దర్శనం కల్పించనుంది. అడవి మార్గంలో వచ్చే భక్తులకు పాసులు తప్పనిసరి అని స్పష్టం చేసింది. రద్దీని తగ్గించేందుకు నీలక్కల్ దగ్గర కొత్తగా 7 బుకింగ్ సెంటర్లు ఏర్పాటు చేసింది.


