News February 1, 2025

పెద్దపల్లి: ఉరేసుకుని వృద్ధురాలి ఆత్మహత్య

image

పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం కిష్టంపేటలో ఓ వృద్ధురాలు ఆత్మహత్య చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన ఐరవేణి రామక్క (90) అనారోగ్య సమస్యలతో బాధపడుతూ, ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాత్రూంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెంకటేశ్ తెలిపారు. మృతురాలికి ముగ్గురు కొడుకులు ఉన్నారు.

Similar News

News February 16, 2025

సంగారెడ్డి: రేపటి నుంచి ప్రాక్టీస్ పేపర్-2 పరీక్షలు

image

జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రవేట్ పాఠశాల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు రేపటి నుంచి 4 వరకు ప్రాక్టీస్ పేపర్-2 పరీక్షలను నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. డీఈవో మాట్లాడుతూ.. ప్రాక్టీస్ పేపర్లకు సంబంధించిన ప్రశ్నా పత్రాలను మండల వనరుల కేంద్రాల సంగారెడ్డిలో ఈ నెల నుంచి 10వ తరగతి ప్రాక్టీస్ పేపర్-2 పరీక్షలు నుంచి తీసుకోవాలని సూచించారు.

News February 16, 2025

ఏపీ ఇష్టారాజ్యం-కాంగ్రెస్ చోద్యం: KTR

image

TG: కృష్ణా జలాలను ఏపీ ఇష్టారాజ్యంగా తరలించుకుపోతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం చోద్యం చూస్తోందని KTR విమర్శించారు. నాగార్జునసాగర్ కుడి కాల్వ ద్వారా గత 3 నెలలుగా రోజుకు 10వేల క్యూసెక్కుల సామర్థ్యంతో ఇప్పటికే 646 టీఎంసీలను వినియోగించుకుందని ఆరోపించారు. కృష్ణా, గోదావరి నదుల్లో బొట్టు బొట్టును కాపాడి బీడు భూములను KCR సస్యశ్యామలం చేస్తే ఏడాది కాలంలోనే కాంగ్రెస్ పంటపొలాలను ఎండబెట్టిందని Xలో ఫైరయ్యారు.

News February 16, 2025

ఓటములే గుణపాఠాలు: విక్రాంత్

image

విద్యార్థులు పరీక్షల కోసం కాకుండా జ్ఞానం కోసం చదివినట్లయితే ఒత్తిడి అనేది ఉండదని యాక్టర్ విక్రాంత్ మాస్సే అన్నారు. ‘పరీక్షా పే చర్చ’ లో నటి భూమి పెడ్నేకర్‌తో కలిసి పరీక్షల అనుభవాల్ని స్టూడెంట్స్‌తో పంచుకున్నారు. ఓటములనేవి జీవితంలో భాగమని వాటినుంచే మనం అధికంగా నేర్చుకోవచ్చని సూచించారు. విద్యార్థులు తమకంటూ స్వంత లక్ష్యాలను పెట్టుకొని వాటిని సాధించేలా కృషి చేయాలన్నారు.

error: Content is protected !!