News May 11, 2024

పెద్దపల్లి ఎంపీ అభ్యర్థికి నోటీసులు

image

ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించిన ఘటనలో పెద్దపల్లి BRS MP అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌కు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. బెల్లంపల్లి మండలం పెద్దబూద గ్రామంలో ఈ నెల 6న పార్టీ కండువాలు ధరించి ప్రచారం చేసినట్లు పలువురు ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన ఎన్నికల అధికారులు ఆయనకు నోటీసులు పంపించారు. దీనిపై ఆయన వివరణ ఇవ్వాలని లేదంటే చర్యలు తీసుకోవాలని పెద్దపల్లి ఎన్నికల అధికారికి ఆదేశాలు జారీ చేశారు.

Similar News

News October 25, 2025

రైతులకు నష్టం జరగకుండా పటిష్ట చర్యలు: కలెక్టర్

image

పత్తి కొనుగోళ్లలో రైతులకు ఎటువంటి నష్టం జరగకుండా పటిష్ట చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ రాజార్షిషా తెలిపారు. ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్‌ యార్డులో పత్తి కొనుగోళ్లు అక్టోబర్ 27, 2025 నుంచి ప్రారంభం కానున్నాయని, ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం, మార్కెటింగ్‌ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం రైతులకు ఎంఎస్‌పీ (MSP) ధర లభించేలా CCI కొనుగోలు కేంద్రాలను త్వరితగతిన ప్రారంభించేందుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు.

News October 25, 2025

ADB: యూట్యూబ్‌లో యువతి పరిచయం.. రూ.8 లక్షల టోకరా

image

యూట్యూబ్లో పరిచయమై రూ.8 లక్షలకు యువతి టోకరా ఇచ్చిన ఘటన వెలుగు చూసింది. ఆదిలాబాద్‌లో బంగారు నగల పని చేసే వ్యక్తి 10 నెలల కిందట యూట్యూబ్ చూస్తుండగా ఒక నెంబరు రాగా.. HYD కు చెందిన కృష్ణవేణి పరిచయమైంది. అత్యవసరంగా డబ్బు అవసరముందంటూ విడతల వారీగా బాధితుని నుంచి రూ.8లక్షల వరకు ఆమె తీసుకుంది. యువతికి డబ్బుల అడగగా ఇవ్వను.. ఏం చేసుకుంటావో చేసుకో అని బెదిరించింది. దీంతో బాధితుడు వన్ టౌన్‌లో ఫిర్యాదు చేశాడు.

News October 25, 2025

మొక్కల నాటే లక్ష్యం వంద శాతం పూర్తి: ఆదిలాబాద్ కలెక్టర్

image

వనమహోత్సవం కార్యక్రమం కింద ఈ ఆర్థిక సంవత్సరానికి లక్ష్యంగా పెట్టుకున్న మొక్కల నాటకం వంద శాతం పూర్తయిందని కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. ఇప్పటివరకు ఈత 23,400, మహువా 70,187, బాంబు 1,04,583 మొక్కలు నాటడం జరిగిందని, జియో ట్యాగింగ్ 97 శాతం పూర్తయిందని వివరించారు. పంచాయతీ నర్సరీల్లో ప్రస్తుతం 17,27,726 మొక్కలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. 48 పాఠశాలల్లో 4,250 కూరగాయల మొక్కలు నాటినట్లు తెలిపారు.