News May 11, 2024
పెద్దపల్లి ఎంపీ అభ్యర్థికి నోటీసులు

ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించిన ఘటనలో పెద్దపల్లి BRS MP అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌కు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. బెల్లంపల్లి మండలం పెద్దబూద గ్రామంలో ఈ నెల 6న పార్టీ కండువాలు ధరించి ప్రచారం చేసినట్లు పలువురు ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన ఎన్నికల అధికారులు ఆయనకు నోటీసులు పంపించారు. దీనిపై ఆయన వివరణ ఇవ్వాలని లేదంటే చర్యలు తీసుకోవాలని పెద్దపల్లి ఎన్నికల అధికారికి ఆదేశాలు జారీ చేశారు.
Similar News
News February 16, 2025
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి క్రైమ్ న్యూస్

✓ శంకరపట్నం మండలంలో చికిత్స పొందుతూ యువరైతు మృతి ✓ మంథని: రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలు✓ కుంభమేళా వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదం.. ధర్మపురికి చెందిన మహిళా మృతి✓ జగిత్యాల పట్టణంలో ప్రముఖ చిత్రకారుడు మచ్చ రవి గుండెపోటుతో మృతి✓ జగిత్యాల: ట్రాక్టర్, బైక్ ఢీ.. ఒకరి పరిస్థితి విషయం✓ ఇల్లంతకుంట మండలంలో గంజాయి అమ్ముతున్న వ్యక్తి అరెస్టు
News February 16, 2025
జగిత్యాల: కుంభమేళా వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదం.. మహిళ మృతి

మధ్యప్రదేశ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో JGTL(D) ధర్మపురికి చెందిన వెంగళ ప్రమీల చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతిచెందారు. 10 రోజులక్రితం కుటుంబసభ్యులతో కలిసి 2 కార్లలో కుంభమేళాకు వెళ్లి వస్తుండగా గురువారం ఒక కారుకు ప్రమాదం జరిగింది. వెంటనే ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ ప్రమీల మృతిచెందింది. ప్రమీల గోదావరి నది తీరాన కొబ్బరికాయలు అమ్ముతూ జీవనం సాగిస్తుంది. పూర్తివివరాలు తెలియాల్సి ఉంది.
News February 16, 2025
పన్నుల వసూళ్లలో హుజూరాబాద్ రెండో స్థానం

ఇంటి పన్నుల వసూళ్లలో HZB మున్సిపాలిటీ రాష్ట్రంలో 2వ స్థానంలో నిలిచిందని కమిషనర్ సమ్మయ్య తెలిపారు. గతంలో వసూళ్లలో 5వ స్థానంలో ఉన్నదానిని తాను బాధ్యతలు చేపట్టిన తర్వాత ఉద్యోగుల సహకారంతో రూ.2.03కోట్లు వసూలుచేసి, 76.95శాతం వసూళ్లతో రికార్డు సాధించగలిగామన్నారు. మున్సిపల్ పరిధిలో ఇంటి పన్ను కట్టేవారు 9,431 మంది ఉన్నారన్నారు. ఉద్యోగులు, ప్రజల సహకారంతో రాష్ట్రంలో మొదటి స్థానం కోసం కృషి చేస్తున్నామన్నారు.