News March 6, 2025

పెద్దపల్లి: ఎక్కడి సమస్యలు అక్కడే..!

image

గ్రామాల్లో సర్పంచ్‌ల పదవీకాలం ముగిసి సంవత్సరం దాటింది. అప్పటినుంచి కరీంనగర్ జిల్లాలోని 266 గ్రామపంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతోంది. దీంతో గ్రామాల్లో సమస్యలు తిష్ఠవేశాయి. గ్రామపంచాయతీలకు పాలకవర్గాలు లేకపోవడంతో ప్రభుత్వాలు నిధులు విడుదల చేయడం లేదు. ఎక్కడి సమస్యలు అక్కడే పేరుకుపోయాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి స్థానిక ఎన్నికలు నిర్వహించాలని గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

Similar News

News September 16, 2025

సకాలంలో బాల సంజీవిని కిట్లు అందించాలి: జేసీ

image

బాల సంజీవిని కిట్లను సకాలంలో అంగన్వాడీ కేంద్రాలకు అందేలా పర్యవేక్షించాలని సంబంధిత అధికారులను జేసీ రాహుల్ ఆదేశించారు. మంగళవారం భీమవరంలో జేసీ ఛాంబర్లో జిల్లా స్థాయి సప్లిమెంటరీ న్యూట్రిషన్ ప్రోగ్రాం మానిటరింగ్ రివ్యూ కమిటీ సమావేశాన్ని సంబంధిత కమిటీ సభ్యులతో నిర్వహించారు. గర్భిణులు, బాలింతలకు ప్రభుత్వం ప్రతినెలా అందిస్తున్న పోషకాహార సరుకులను నాణ్యతతో నిర్ణీత సమయానికి అందజేయాలన్నారు.

News September 16, 2025

ఈనెల 18న వేములవాడ హుండీ లెక్కింపు

image

వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో హుండీ లెక్కింపు ఈనెల 18న ఉదయం 8 గంటలకు జరగనుంది. దేవస్థానం కార్యనిర్వహణాధికారి మంగళవారం ఈ విషయాన్ని తెలిపారు. ఈ లెక్కింపులో భక్తులు సమర్పించిన నోట్లు, నాణేలు, బంగారం, వెండి ఆభరణాలు ఉంటాయని చెప్పారు. అధికారుల సమక్షంలో, లెక్కింపు కమిటీ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు.

News September 16, 2025

ఆదిలాబాద్: డిగ్రీ సెమిస్టర్ ఫలితాలు విడుదల

image

డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ ఫలితాలు విడుదలైనట్లు ఆదిలాబాద్ ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డా.జే సంగీత, వర్సిటీ ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ జగ్రామ్ పేర్కొన్నారు. 2025 జూలై నెలలో రాసిన డిగ్రీ మొదటి సంవత్సరం రెండవ సెమిస్టర్ ఫలితాలు విడుదలైనట్లు పేర్కొన్నారు. ఫలితాల కోసం ఈ https://braou.ac.in/result#gsc.tab=0 వెబ్ సైట్‌ను సందర్శించాలని సూచించారు.