News March 6, 2025

పెద్దపల్లి: ఎక్కడి సమస్యలు అక్కడే..!

image

గ్రామాల్లో సర్పంచ్‌ల పదవీకాలం ముగిసి సంవత్సరం దాటింది. అప్పటినుంచి కరీంనగర్ జిల్లాలోని 266 గ్రామపంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతోంది. దీంతో గ్రామాల్లో సమస్యలు తిష్ఠవేశాయి. గ్రామపంచాయతీలకు పాలకవర్గాలు లేకపోవడంతో ప్రభుత్వాలు నిధులు విడుదల చేయడం లేదు. ఎక్కడి సమస్యలు అక్కడే పేరుకుపోయాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి స్థానిక ఎన్నికలు నిర్వహించాలని గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

Similar News

News March 27, 2025

ఆ గాయం మానేందుకు 9 నెలలు: రష్మిక

image

తన కాలి గాయం మానేందుకు 9 నెలల సమయం పడుతుందని హీరోయిన్ రష్మిక మందన్న తెలిపారు. సోషల్ మీడియలో ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ప్రస్తుతం కొంత కోలుకున్నానని, నడవగలుగుతున్నానని చెప్పారు. అలాగే తనకు ఎత్తైన ప్రదేశాలు, నీటి లోతు ఎక్కువగా ఉండే ప్రదేశాలంటే చాలా భయమని పేర్కొన్నారు. కాగా జిమ్‌లో వర్కౌట్లు చేస్తుండగా రష్మిక గాయపడిన విషయం తెలిసిందే. గాయంతోనే ‘ఛావా’ ప్రమోషన్లకు హాజరయ్యారు.

News March 27, 2025

Stock Markets: బ్యాంక్, ఫైనాన్స్ షేర్ల జోరు

image

స్టాక్‌మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలే లభించినప్పటికీ ఇన్వెస్టర్లు కొనుగోళ్లు చేపట్టారు. నిఫ్టీ 23,560 (73), సెన్సెక్స్ 77,570 (275) వద్ద ట్రేడవుతున్నాయి. PSU బ్యాంక్స్, PSE, CPSE, బ్యాంకు, ఫైనాన్స్, ఐటీ, చమురు, కమోడిటీస్, ఇన్ఫ్రా, ఎనర్జీ షేర్లు ఎగిశాయి. ఆటో, ఫార్మా, హెల్త్‌కేర్ షేర్లు కుంగాయి. విప్రో, శ్రీరామ్ ఫైనాన్స్, హీరోమోటో, LT టాప్ గెయినర్స్.

News March 27, 2025

గుంటూరు జిల్లా అభివృద్ధికి కలెక్టర్ ప్రణాళికలు

image

గుంటూరు జిల్లా సమగ్ర అభివృద్ధికి పలు లక్ష్యాలను నిర్ధేశించుకొని కలెక్టర్‌ నాగలక్ష్మీ సిద్ధం చేసిన ప్రణాళికను బుధవారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కలెక్టర్‌ల సదస్సులో వివరించారు. పవర్‌ పాయింట్‌ ప్రజేంటేషన్‌ ద్వారా లక్ష్యాలను తెలిపారు. తయారీ రంగంలో 5వేల చిన్న, మధ్యతరహా, సూక్ష్మ స్థాయి పరిశ్రమలు స్థాపనకు కృషి చేస్తామని, 2 మెగా పారిశ్రామిక వాడలను ఏర్పాటు చేస్తామని వివరించారు. 

error: Content is protected !!