News February 1, 2025
పెద్దపల్లి ఎదురుచూస్తోంది.. నిర్మలమ్మ కరుణించేనా?

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ శనివారం లోకసభలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌పై పెద్దపల్లి జిల్లా వాసులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఓదెల శ్రీమల్లికార్జున స్వామి ఆలయానికి ప్రసాద్ పథకంలో నిధులు కేటాయించడం, ఉడాన్ పథకంలో బసంత్ నగర్‌కు చోటు కల్పించడం, రామగుండంలో రైల్వే కోచ్ ఏర్పాటు, PDPLలో పలు రైళ్ల హాల్టింగ్ కల్పించాలని తదితర డిమాండ్లు ఉన్నాయి.
Similar News
News December 5, 2025
సిరిసిల్ల: ‘బస్సులో నగదు బ్యాగు ఎత్తుకెళ్లిన దొంగ అరెస్ట్’

డబ్బుల బ్యాగులు దొంగిలించిన వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్ర చారి తెలిపారు. శ్రీనివాస్ అనే వ్యక్తి బ్యాగును బస్సులో నుంచి బండారి బాలరాజు ఎత్తుకెళ్లాడన్నారు. ఆ బ్యాగులో రూ.3,97,500 నగదు ఉందని బాధితులు శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. సీసీ కెమెరాల ద్వారా నిందితుడిని గుర్తించి అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామన్నారు.
News December 5, 2025
ప.గో: తల్లిని కాపాడిన కొడుకు

భీమవరం మండలం జొన్నలగురువు గ్రామానికి చెందిన ఎన్.దీక్షిత్ సమయస్ఫూర్తి ప్రదర్శించి తన తల్లి ప్రాణాలను కాపాడాడు. శుక్రవారం ఎంపీపీ పాఠశాలలో మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్‌కు దీక్షిత్ తన తల్లిని పిలవడానికి ఇంటికి వెళ్లాడు. ఇంట్లో ఆమె విద్యుత్ షాక్‌కు గురై ఉండటాన్ని గమనించాడు. వెంటనే విద్యుత్ సరఫరాను నిలిపివేశాడు. దీంతో తల్లికి పెను ప్రమాదం తప్పింది. దీక్షిత్‌ను ఉపాధ్యాయులు, గ్రామస్తులు అభినందించారు.
News December 5, 2025
కామారెడ్డి: స్థానిక సంస్థల ఎన్నికలపై కలెక్టర్ సమీక్ష

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ శుక్రవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. మొదటి దశ ఏకగ్రీవ సర్పంచి, ఉప సర్పంచి, వార్డులతో పాటు తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘనలపై వచ్చిన 7 ఫిర్యాదులు పరిష్కరించాలని ఆదేశించారు. ఎన్నికల పారదర్శకత, నిబంధనల అమలుకు సమయానుసార చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.


