News January 24, 2025

పెద్దపల్లి: ఎమ్మెల్యే సొంత డబ్బులతో రాజమల్లు విగ్రహం ఏర్పాటు

image

పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ బిరుదు రాజమల్లు లేనిలోటు తీర్చలేనిదని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు అన్నారు. బడుగు బలహీన వర్గాల ప్రతినిధిగా గుర్తింపు పొందిన నాయకుడు రాజమల్లు అని ఆయన కొనియాడారు. శుక్రవారం ఆయన ప్రథమ వర్ధంతి సందర్భంగా తన సొంత ఖర్చులతో సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని ప్రధాన కూడలి వద్ద రాజమల్లు కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి నివాళులర్పించారు.

Similar News

News November 2, 2025

కీలక వికెట్లు కోల్పోయిన భారత్

image

ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టీ20లో భారత్ కీలక వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ (25), గిల్ (15), కెప్టెన్ సూర్య (24) ఔటయ్యారు. తిలక్ వర్మ, అక్షర్ పటేల్ క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం టీమ్ ఇండియా స్కోర్ 8 ఓవర్లలో 82/3గా ఉంది. సూర్య సేన విజయానికి మరో 72 బంతుల్లో 105 రన్స్ అవసరం. మరి ఈ మ్యాచులో ఎవరు గెలుస్తారో కామెంట్ చేయండి.

News November 2, 2025

సిరిసిల్ల: రేపటి నుంచి సీసీఐ ద్వారా పత్తి కొనుగోళ్ళు

image

పత్తి పంటను సోమవారం నుండి కొనుగోలు చేసేందుకు సీసీఐ సిద్ధమైంది. వేములవాడ అర్బన్, రూరల్, చందుర్తి, బోయినపల్లి, కోనరావుపేట, రుద్రంగి మండలాలలో సుమారు మూడు లక్షల పైచిలుకు క్వింటాళ్ల పత్తి దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. నాంపల్లి, సంకేపల్లి, సుద్దాల లోని జిన్నింగ్ మిల్లులలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. పత్తి విక్రయించే రైతులు ముందుగా స్లాట్ బుకింగ్ చేసుకోవాలని అధికారులు సూచించారు.

News November 2, 2025

కామారెడ్డిలో రేపు ప్రజావాణి

image

కామారెడ్డి కలెక్టరేట్‌లో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు అధికారులు ప్రజల నుంచి నేరుగా వినతిపత్రాలు స్వీకరిస్తారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ జిల్లా ప్రజలకు సూచించారు.