News February 6, 2025

పెద్దపల్లి: ఎస్సీ, ఎస్టీ సబ్సిడీలను ఆమోదించాలి: కలెక్టర్

image

పెద్దపల్లి జిల్లా పారిశ్రామిక ప్రోత్సాహ కమిటీలో ఎస్సీ, ఎస్టీ సబ్సిడీలను త్వరితగతిన ఆమోదించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. ఈ మేరకు కలెక్టరేట్ కార్యాలయంలో ఇండస్ట్రియల్, బ్యాంకు అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకం కింద పెండింగులో ఉన్న అప్లికేషన్లకు ఆమోదం తెలపాలన్నారు. కార్యక్రమంలో జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి శేఖర్ తదితరులు ఉన్నారు.

Similar News

News September 18, 2025

ట్రైనీ ఇంజినీర్ పోస్టులు

image

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(<>BEL<<>>) 35 ట్రైనీ ఇంజినీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. బీటెక్/BE ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు ఈనెల 24వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయోపరిమితి 28ఏళ్లు. దరఖాస్తు ఫీజు రూ.177. SC, ST, దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు కలదు. అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

News September 18, 2025

మైథాలజీ క్విజ్ – 9

image

1. రాముడికి ఏ నది ఒడ్డున గుహుడు స్వాగతం పలికాడు?
2. దుర్యోధనుడి భార్య ఎవరు?
3. ప్రహ్లాదుడు ఏ రాక్షస రాజు కుమారుడు?
4. శివుడి వాహనం పేరు ఏమిటి?
5. మొత్తం జ్యోతిర్లింగాలు ఎన్ని?
<<-se>>#mythologyquiz<<>>

News September 18, 2025

చిత్ర పరిశ్రమ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తాం: సీఎం

image

సినీ కార్మికులకు అండగా ఉంటామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. నైపుణ్య శిక్షణ, ఆరోగ్య బీమా కల్పించి, చిన్న బడ్జెట్ సినిమాలకు సహాయం చేస్తామన్నారు. HYDను హాలీవుడ్‌ స్థాయికి తీసుకెళ్దామని చెప్పారు. ‘గద్దర్ అవార్డులు’ కొనసాగిస్తామని తెలిపారు. కార్మికుల సమస్యలు స్వయంగా పరిష్కరిస్తామని సీఎం హామీ ఇవ్వడంతో, వారు కృతజ్ఞతలు తెలిపారు.