News July 10, 2024

పెద్దపల్లి: ఏడో తరగతి విద్యార్థి మృతి

image

ఏడో తరగతి విద్యార్థి మృతి చెందిన ఘటన పెద్దపల్లి జిల్లాలో జరిగింది. SI సాంబమూర్తి వివరాల ప్రకారం.. ఎలిగేడు మండలానికి చెందిన సదయ్య కుమారుడు శ్రీవత్సవ్‌(13)కు ఒక కన్ను కనిపించకపోవడంతో రేకుర్తిలోని ప్రభుత్వ అందుల పాఠశాలలో ఆరేళ్ల క్రితం చేర్పించారు. అయితే బాలుడు
దుస్తులు ఆరవేసే తీగపై ఉన్న టవల్‌ను మెడకు చుట్టుకొని ఆడుకుంటుండగా మరణించినట్లు సీసీ కెమెరాలో రికార్డయింది. తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదైంది.

Similar News

News December 6, 2025

గ్రామపంచాయతీ ఎన్నికల భద్రతపై సీపీ గౌష్ ఆలం సమీక్ష

image

గ్రామ పంచాయతీ ఎన్నికల భద్రత ఏర్పాట్లపై కరీంనగర్ సీపీ గౌష్ ఆలం శనివారం కమిషనరేట్‌లో పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు పటిష్ఠ చర్యలు తీసుకోవాలని, సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఆదేశించారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించేవారిపై కఠిన చర్యలు తప్పవని సీపీ స్పష్టం చేశారు. రౌడీ షీటర్ల బైండోవర్‌ను పూర్తి చేసి, వారిపై నిరంతర నిఘా ఉంచినట్లు తెలిపారు.

News December 6, 2025

రక్త సంబంధీకుల నుంచి బాబు దత్తత

image

జిల్లా మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ, మిషన్ వాత్సల్య ఆధ్వర్యం పిల్లలు లేని దంపతులు తమ రక్త సంబంధీకుల నుంచి 12 నెలల బాబును చట్టపరంగా దత్తత తీసుకున్నారు. ఈ దత్తత ఉత్తర్వులను శనివారం జిల్లా కలెక్టర్‌ పమేలా సత్పతి దంపతులకు అందజేశారు. దత్తత ప్రక్రియ తప్పనిసరిగా చట్టబద్ధంగా ఉండాలని, దీని కోసం జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయాన్ని సంప్రదించాలని కలెక్టర్ సూచించారు.