News August 3, 2024

పెద్దపల్లి: ఏసీబీకి చిక్కిన తహశీల్దార్

image

పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల తహశీల్దార్ ఏసీబీకి చిక్కాడు. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాలు.. మందమర్రికి చెందిన రైతు కాడం తిరుపతి నుంచి రూ.10,000 లంచం తీసుకుంటుండగా తహశీల్దార్ జహేద్ పాషాతో పాటు అతడి బినామీ వీఆర్ఏ విష్ణు, డ్రైవర్ అంజద్‌‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. రైతు వద్ద మ్యూటేషన్ కోసం లంచం తీసుకుంటున్నట్లు సమాచారం.

Similar News

News December 13, 2025

ఇందుర్తి: ప్రచారం ముగిసినా ఆన్‌లైన్ పోల్.. కేసు నమోదు

image

చిగురుమామిడి మండలంలో గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం గడువు ముగిసిన తర్వాత కూడా ఇన్‌స్టాగ్రామ్‌‌లో ‘మాక్ పోల్’ నిర్వహించిన ఘటనపై కేసు నమోదైంది. ఇందుర్తి గ్రామంలోని సర్పంచ్ అభ్యర్థుల పేర్లతో పోల్ నిర్వహించడం ద్వారా ఎన్నికల నిబంధనలు (MCC) ఉల్లంఘించారని మండల నోడల్ అధికారి ఫిర్యాదు చేశారు. చిగురుమామిడి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News December 13, 2025

KNR: పంచాయతీ పోరుకు పటిష్ట భద్రత: సీపీ

image

కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో రేపు జరగనున్న రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు పటిష్ట భద్రతా చర్యలు చేపట్టినట్లు సీపీ గౌష్ ఆలం తెలిపారు. మానకొండూరు నియోజకవర్గంలోని ఐదు మండలాల్లోని 113 పంచాయతీల కోసం 1046 పోలింగ్ కేంద్రాల వద్ద అదనపు బలగాలు మోహరిస్తున్నట్లు చెప్పారు. శాంతిభద్రతల పరిరక్షణకు నిషేధాజ్ఞలు విధించారు. విజయోత్సవ ర్యాలీలు నిషేధమని స్పష్టం చేశారు.

News December 13, 2025

KNR: పోలింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రత: సీపీ

image

శంకరపట్నం మండలంలోని మోడల్‌ స్కూల్‌లో ఏర్పాటు చేసిన ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని కరీంనగర్‌ పోలీస్‌ కమిషనర్‌ (సీపీ) గౌస్‌ ఆలాం శనివారం సందర్శించారు. 144 సెక్షన్‌ అమలులో ఉన్నందున గుంపులుగా సంచరించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. రిటర్నింగ్‌ అధికారులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా తక్షణమే పోలీస్‌ శాఖకు సమాచారం ఇవ్వాలని ఆయన సూచించారు.