News March 22, 2024
పెద్దపల్లి: కాంగ్రెస్ పార్టీ MP అభ్యర్థి గడ్డం వంశీ నేపథ్యం ఇదీ!

పెద్దపల్లి MP అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ గడ్డం వంశీకృష్ణ పేరును ఖరారు చేసింది. 2010లో బ్యాచులర్ ఆఫ్ సైన్స్, మేనేజ్‌మెంట్ డిగ్రీ USAలో పూర్తి చేశాడు. 2011లో విశాఖ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సంస్థలో శిక్షణ తీసుకుని, 2012లో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ స్థాయికి ఎదిగాడు. వీ6 ఛానల్ ఎండీగా బాధ్యతలు స్వీకరించారు. ఇప్పుడు తొలిసారిగా రాజకీయ అరంగ్రేటం చేయనున్నారు.
Similar News
News November 22, 2025
ఆదిలాబాద్ డీసీసీ అధ్యక్షుడిగా నరేష్ జాదవ్

కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడి నియామకం జరిగింది. ఆ పార్టీ సీనియర్ నాయకుడు డాక్టర్ నరేష్ జాదవ్ను డీసీసీ అధ్యక్షుడిగా నియమిస్తూ ఏఐసీసీ జనరల్ సెక్రటరీ వేణుగోపాల్ శనివారం రాత్రి ఉత్తర్వులు ఇచ్చారు. గతంలో నరేష్ జాదవ్ ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానానికి పోటీ చేసిన విషయం తెలిసిందే.
News November 22, 2025
నార్నూర్: రికార్డు సాధించిన ఏకలవ్య పాఠశాల

నార్నూర్లోని ప్రభుత్వ గురుకుల ఏకలవ్య పాఠశాల రికార్డు సాధించింది. ఈ నెల 11 నుంచి 15వ తేదీ వరకు ఒడిశాలో జరిగిన 4వ జాతీయ EMRS క్రీడా సమ్మిట్లో విద్యార్థులు పాల్గొని నేరుగా 11 స్వర్ణాలు, 15 వెండి, 13 కాంస్య పథకాలు గెలుపొందారు. ఈ నేపథ్యంలో జాతీయ స్థాయిలో పేరు పొందడంతో శనివారం క్రీడాకారులను పాఠశాల సిబ్బంది అభినందించారు.