News April 5, 2025
పెద్దపల్లి: కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలను ఎండగట్టాలి

కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర నాయకుడు అల్జాపూర్ శ్రీనివాస్ తెలిపారు. శనివారం పెద్దపల్లిలో జిల్లా అధ్యక్షుడు కర్రే సంజీవరెడ్డి అధ్యక్షతన జిల్లాస్థాయి పదాధికారుల సమావేశం నిర్వహించారు. బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Similar News
News April 8, 2025
పీజీఆర్ఎస్ అర్జీలు పరిష్కారం ఒక ఎండార్స్మెంట్ కారాదు: కలెక్టర్

పీజీఆర్ఎస్ అర్జీలు పరిష్కారం ఒక ఎండార్స్మెంట్ కారదని, అందులో సంబంధించిన ఉత్తర్వులు కచ్చితంగా ఉండాలని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం జిల్లా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరం నుంచి ఆర్డీవో, తహశీల్దార్లు, మండల సర్వే అధికారులతో సమావేశం అయ్యారు. రెవెన్యూ అర్జీలు, వాటి పరిష్కార విధానం, ఐవీఆర్ఎస్ ఫిర్యాదులపై ప్రతిస్పందన వ్యవస్థపై చర్చించారు.
News April 8, 2025
కెనడాలో ఉండేవారికి శుభవార్త.. కనీస వేతనం పెంపు

కెనడా ప్రజలకు అక్కడి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రైవేట్ సెక్టార్లో కనీస వేతనాలను పెంచింది. ప్రస్తుతం గంటకు కనీస వేతనం 17.30 డాలర్లు ఉండగా దాన్ని 17.75 డాలర్లకు పెంచుతున్నట్లు ప్రకటించింది. కాగా జస్టిన్ ట్రూడో ప్రభుత్వంలో వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఎన్నికల్లో ద్రవ్యోల్బణం అంశమే కీలక అజెండాగా మారింది. కెనడా జనాభాలో 3.7% ఉన్న భారతీయులకు ఈ నిర్ణయంతో ప్రయోజనం కలగనుంది.
News April 8, 2025
రేపు ఎన్టీఆర్-నీల్ సినిమా అప్డేట్

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న సినిమా నుంచి రేపు కొత్త అప్డేట్ రానుంది. రేపు మ.12.06 గంటలకు ప్రకటన ఉంటుందని మేకర్స్ తెలిపారు. మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు రవి బసూర్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి మూవీని రిలీజ్ చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీకి ‘డ్రాగన్’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది.