News February 22, 2025
పెద్దపల్లి: కాంగ్రెస్ రూ.50వేల కోట్ల దోపిడీ: బండి సంజయ్

పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని బీజేపీ ఎమ్మెల్సీ ఎన్నికల సమావేశంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ఎల్ఆర్ఎస్ పేరుతో రూ.50 వేల కోట్ల దోపిడీకి స్కెచ్ వేసిందన్నారు. కేంద్ర బడ్జెట్‌పై దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి సవాల్ విసిరారు. కాంగ్రెస్ నమ్మక ద్రోహానికి, బీజేపీ పోరాటాలకు మధ్య జరుగుతున్న ఎన్నికలని ఆరోపించారు.
Similar News
News December 3, 2025
ముగింపు ‘అఖండ-2’ తాండవమేనా!

ఈ ఏడాదిలో ఇప్పటివరకు టాలీవుడ్ నుంచి విడుదలైన చిత్రాల్లో సంక్రాంతికి వస్తున్నాం, OG బాక్సాఫీసు వద్ద రూ.300 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టాయి. భారీ అంచనాలతో విడుదలైన గేమ్ ఛేంజర్ ఆకట్టుకోలేకపోయింది. డిసెంబర్లో బడా చిత్రాల్లో ‘అఖండ-2’తో ఈ ఏడాదికి ముగింపు పలకనుంది. సినిమాపై ఉన్న బజ్ కలెక్షన్లపై ఆశలు రేకెత్తిస్తున్నా బాలయ్య మూవీ రికార్డులు సృష్టిస్తుందా అనేది మరికొద్ది రోజుల్లో తేలనుంది.
News December 3, 2025
GDK: మహిళలు, అమ్మాయిలు ఈ నంబర్లు SAVE చేసుకోండి

రామగుండం కమిషనరేట్ షీ టీమ్స్‌కు నవంబర్‌లో 68 ఫిర్యాదులు వచ్చినట్లు సీపీ అంబర్ కిషోర్ ఝా ఒక ప్రకటనలో తెలిపారు. 68 పిటిషన్లలో 15 పిటిషన్లు రామగుండం షీ టీమ్స్‌కు వాట్సాప్ ద్వారా, మిగతా 53 నేరుగా వచ్చాయని వివరించారు. మహిళలు, విద్యార్థినులు అత్యవసర పరిస్థితుల్లో 6303923700, 8712659386, 8712659386 నంబర్ల ద్వారా షీ టీంలను సంప్రదించాలని సీపీ సూచించారు. SHARE IT.
News December 3, 2025
కల్వకుర్తి ఆస్పత్రి.. 24 గంటల్లో 20 కాన్పులు

కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో గడచిన 24 గంటలలో 20 కాన్పులు జరిగినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శివరాం తెలిపారు. ఇందులో 11 నార్మల్ డెలివరీలు, 9 సిజేరియన్ కాన్పులు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారని తెలిపారు. ఇంత పెద్ద సంఖ్యలో విజయవంతంగా కాన్పులు చేసిన ఆసుపత్రి సిబ్బందిని సూపరింటెండెంట్ అభినందించారు.


